News July 30, 2024
తెరుచుకున్న చాపరాయి జలపాతం

సుమారు వారం రోజుల తర్వాత చాపరాయి జలపాతం వద్ద పర్యాటకుల ప్రవేశాలను పునరుద్ధరిచారు. అల్పపీడనం కారణంగా ఏజెన్సీ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిశాయి. దీంతో, చాపరాయి గెడ్డ పొంగి ప్రవహిస్తుండటంతో, ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు ముందస్తు చర్యగా సంబంధిత ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ప్రవేశాలను నిలుపుదల చేశారు. వర్షాలు తగ్గడంతో జలపాతం వద్దకు పర్యాటకులను అనుమతిస్తున్నారు.
Similar News
News July 11, 2025
విశాఖలో ఈసాయ్ సంస్థ విస్తరణ

విశాఖపట్నంలో గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్‌ను ఏర్పాటు చేయాలని ఈసాయ్ ఫార్మాస్యూటికల్స్ నిర్ణయించింది. 2026 ఫిబ్రవరి నాటికి ఈ కేంద్రం పూర్తి స్థాయిలో కార్యకలాపాలు ప్రారంభించనుంది. ఇప్పటికే జేఎన్ ఫార్మా సిటీలో తయారీ ప్లాంట్‌ను నిర్వహిస్తున్న ఈసాయ్ సంస్థ ఈ కొత్త కేంద్రంతో భారత్‌లో తన ఉనికిని మరింతగా బలోపేతం చేయనుంది.
News July 11, 2025
షీలానగర్‌లో యాక్సిడెంట్.. ఒకరి మృతి

షీలానగర్ సమీపంలోని మారుతి సర్కిల్ వద్ద శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. పరవాడకు చెందిన అశోక్ రెడ్డి బైకుపై వెళుతుండగా ట్రాలర్ ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఎయిర్ పోర్ట్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. గతంలో కూడా ఇదే ఏరియాలో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో పలువురు మృతి చెందారు.
News July 11, 2025
కైలాసగిరిపై ‘లూజ్ గ్రావిటీ రైడ్’

కైలాసగిరిపై ‘లూజ్ గ్రావిటీ రైడ్’ని ప్రవేశపెట్టాలని V.M.R.D.A. నిర్ణయించింది. సింగపూర్‌లోని సెంటోసా వద్ద ఈ రైడ్ అత్యంత ప్రజాదరణ పొందింది. గురుత్వాకర్షణ ఆధారంగా ఈ వినోదాత్మక రైడ్ ఉంటుంది. అన్ని వయస్సుల వారు ఈ రైడ్‌ను ఆస్వాదించవచ్చని ఛైర్మన్ ప్రణవ్ గోపాల్ తెలిపారు. కైలాసగిరిపై ఇది మంచి టూరిస్టు ఆకర్షణ అవుతుందని భావిస్తున్నామని ఎంసీ విశ్వనాథన్ తెలిపారు.