News July 30, 2024
ఉమ్మడి మెదక్ జిల్లాకు 87 కొత్త బస్సులు

మెదక్ రీజియన్ పరిధిలోని ఆర్టీసీ డిపోలకు కొత్తగా 87 బస్సులు వచ్చినట్లు మేనేజర్ ప్రభులత ఓ ప్రకటనలో తెలిపారు. మెదక్ రీజియన్ పరిధిలో ఇప్పటి మహలక్ష్మి పథకం కింద 3.80 కోట్ల మంది మహిళలు ప్రయాణించారని, ఈ పథకం తర్వాత 70% ఉన్న ఓఆర్ 98 శాతానికి చేరిందని ప్రకటనలో పేర్కొన్నారు. రీజియన్ పరిధిలో 10 డీలక్సు, 35 పల్లెవెలుగు, 42 ఎక్స్‌ప్రెస్ బస్సులు కొత్తగా వచ్చాయన్నారు.
Similar News
News September 16, 2025
మెదక్: అత్యధికంగా రేగోడ్‌లో 12.5 సెంమీల వర్షం

మెదక్ జిల్లాలో అత్యధికంగా రేగోడ్‌లో 12.5 సెంమీల వర్షం కురిసింది. సోమవారం రాత్రి కుండపోత మాదిరిగా వర్షం కురవడంతో మెదక్ పట్టణం చెరువును తలపించింది. కాగా జిల్లాలో పలు చోట్ల ఉదయం 8 గంటల వరకు వర్షపాత వివరాలు.. మినుపూర్ 108 మిమీ, కొల్చారంలో 102 మిమీ, మెదక్ పట్టణంలో 71 మిమీ, లింగాయిపల్లిలో 71 మిమీ, టేక్మాల్ 59.5 మిమీ వర్షం కురిసింది.
News September 16, 2025
మాసాయిపేట: అనారోగ్యంతో విద్యార్థిని మృతి

మాసాయిపేట మండల కేంద్రానికి చెందిన ఎనిమిదో తరగతి విద్యార్థిని భవాని అనారోగ్యంతో మృతి చెందింది. అనారోగ్యం కారణంగా ప్లేట్‌లెట్స్ తగ్గిపోవడంతో ఆమె చనిపోయినట్లు ఉపాధ్యాయులు తెలిపారు. మాసాయిపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదువుతున్న భవాని సాఫ్ట్‌బాల్ క్రీడలో చురుకుగా ఉండేది. ఆమె మృతి పట్ల ఉపాధ్యాయులు, స్నేహితులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.
News September 16, 2025
రేపటి నుంచి మహిళలకు ఆరోగ్య పరీక్షలు: కలెక్టర్

మహిళలకు మెరుగైన ఆరోగ్య సేవలకై స్వస్త్ నారీ, సశక్త్ పరివార్ అభియాన్ కార్యక్రమం రేపటి నుంచి అక్టోబర్ 2వరకు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. జిల్లాలో మొత్తం 65 హెల్త్ క్యాంపులు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఈ క్యాంపులలో మహిళలకు బీపీ, షుగర్, ఓరల్, బ్రెస్ట్, సర్వైకల్ క్యాన్సర్లు, రక్తహీనత స్క్రీనింగ్ చేయనున్నారు.