News July 30, 2024

ఈరోజు గెలిస్తే చరిత్రలోకి మను భాకర్

image

పారిస్ ఒలింపిక్స్‌లో మరో అరుదైన రికార్డుకు చేరువలో ఉన్నారు మను భాకర్. ఇప్పటికే వ్యక్తిగత విభాగంలో కాంస్యం సాధించగా, ఈరోజు 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్‌డ్ టీమ్ కాంస్యం కోసం పోటీ పడుతున్నారు. ఇదీ గెలిస్తే 124 ఏళ్లలో భారత్ తరఫున ఒకే ఒలింపిక్స్‌లో రెండు పతకాలు గెలిచిన ప్లేయర్‌గా ఆమె నిలుస్తారు. చివరిగా 1900 ఒలింపిక్స్‌లో నార్మన్ ప్రిచర్డ్ అనే బ్రిటీష్ ఇండియన్ భారత్ తరఫున రెండు పతకాలు గెలిచారు.

Similar News

News December 26, 2024

సోనియా గాంధీకి అస్వస్థత?

image

ఏఐసీసీ అగ్ర నేత సోనియా గాంధీ అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది. బెలగావిలో జరుగుతున్న సీడబ్ల్యూసీ మీటింగ్‌లో సోనియా పాల్గొనాల్సి ఉంది. కానీ అస్వస్థతకు గురికావడంతో ఆమెను ఆస్పత్రికి తరలించినట్లు సమాచారం. ఆమెతోపాటు ప్రియాంకా గాంధీ కూడా అక్కడే ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం సీడబ్ల్యూసీ సమావేశాల్లో రాహుల్ గాంధీ మాత్రమే పాల్గొన్నారు.

News December 26, 2024

పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా?: సీఎం రేవంత్

image

TG: అల్లు అర్జున్ తన పేరు మర్చిపోవడంతోనే అరెస్టు చేశారన్న <<14906777>>ప్రచారంపై<<>> సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. ‘ఎవరో నా పేరు మర్చిపోతే నేను ఫీల్ అవుతానా? అలాంటి వార్తలు నమ్మొద్దు. నా స్థాయి అలాంటిది కాదు. ఆ ప్రచారాన్ని ఖండించాల్సిన బాధ్యత టాలీవుడ్‌పై ఉంది కదా?’ అని సినీ ప్రముఖులతో భేటీలో అన్నారు. తాను సినీ పరిశ్రమ బాగుండాలని కోరుకునే వ్యక్తినని రేవంత్ పేర్కొన్నారు.

News December 26, 2024

ఆ కారణం వల్లే మహాత్మాగాంధీ హత్య: సోనియా

image

పార్టీ ఎదుర్కొంటున్న సవాళ్లను అధిగమించేందుకు ఐకమత్యంగా ముందుకు సాగుదామని కాంగ్రెస్ నేత సోనియా గాంధీ బెలగావి సభలో నేతలకు ఓ సందేశంలో తెలిపారు. ‘స్వాతంత్ర్యం కోసం ఎలాంటి పోరాటమూ చేయని సంస్థలు మహాత్మాగాంధీని తీవ్రంగా వ్యతిరేకించాయి. ఒక విషతుల్యమైన వాతావరణాన్ని క్రియేట్ చేశాయి. వాటి వల్లే ఆయన హత్య జరిగింది. కేంద్రంలో అధికారానికి వచ్చిన వారి వల్ల గాంధీ ఘనత ప్రమాదంలో పడింది’ అన్నారు.