News July 30, 2024

విజయనగరం బాలికపై అత్యాచారం..!

image

పశ్చిమ గోదావరి జిల్లాలో విజయనగరం జిల్లా బాలికపై అత్యాచారం జరిగినట్లు కేసు నమోదైంది. స్థానిక SI జ్యోతి తెలిపిన వివరాల ప్రకారం.. జంగారెడ్డిగూడెం యువకుడికి విజయనగరం బాలిక ఇన్‌స్టాలో పరిచయమైంది. అతడిని కలిసేందుకు JRG బస్టాండ్‌ వద్దకు వెళ్లింది. యువకుడు బాలికతో మాట్లాడి కాసేపట్లో వస్తానని వెళ్లిపోయాడు. వేగవరానికి చెందిన రాజు అనే మరొక వ్యక్తి బాలికను ఊరు పంపిస్తానని చెప్పి రూంలో ఉంచి అత్యాచారం చేశాడు.

Similar News

News November 4, 2025

విజయనగరం జిల్లాలో బాల్య వివాహాలపై అవగాహన

image

విజయనగరం జిల్లాలో బాల్య వివాహాల నిర్మూలన, బాల కార్మికత నిర్మూలన అంశాలపై ప్రభుత్వ శాఖల సహకారంతో పనిచేయడం జరుగుతుందని ప్రాజెక్ట్ డైరెక్టర్ ఎం. ప్రసాద్ రావు తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా దేశవ్యాప్తంగా బాల్యవివాహాల నిర్మూలనకు నవంబరు ఒకటవ తేదీ నుంచి వంద రోజులు ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పారు. ఈ నెలలో వివాహాలు ఎక్కువగా జరుగుతాయనే ఉద్దేశంతో గ్రామాల్లో అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు.

News November 3, 2025

VZM: మొంథా బీభత్సం.. 665.69 హెక్టార్లలో పంటల నష్టం..!

image

మొంథా తుఫాను కారణంగా జిల్లాలో పలు మండలాల్లో పంటలకు గణనీయమైన నష్టం జరిగినట్లు జిల్లా వ్యవసాయ అధికారి వీటీ రామారావు తెలిపారు. జిల్లాలోని 27 మండలాల్లో పంట నష్టాల అంచనా పూర్తయిందని ఆయన తెలిపారు. మొత్తం 665.69 హెక్టార్లలో 3,076 మంది రైతులు పంట నష్టాన్ని ఎదుర్కొన్నారని, వరి 644.03 హెక్టార్లు, మొక్కజొన్న 6.40 హెక్టార్లు, పత్తి 4.93 హెక్టార్లు, మినుములు 1.01 హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నాయని వివరించారు.

News November 2, 2025

దేవాలయాల వద్ద ఏర్పాట్లుపై కలెక్టర్ సూచనలు

image

కార్తీక సోమవారం సందర్భంగా జిల్లాలోని వివిధ దేవాలయాల్లో భక్తుల రద్దీ అధికంగా ఉండే అవకాశం ఉందని, దేవాలయాలపై కన్నేయాలని కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి ఆదేశించారు. దేవాలయాల వద్ద భద్రతా ఏర్పాట్లు, ట్రాఫిక్ నియంత్రణ, పారిశుద్ధ్య చర్యలు పకడ్బందీగా ఉండేలా అధికారులు, దేవస్థాన నిర్వాహకులు చర్యలు తీసుకోవాలని సూచించారు. భక్తులు క్రమశిక్షణగా, శాంతియుతంగా దర్శనాలు ముగించుకోవాలన్నారు.