News July 30, 2024
రుణమాఫీ చాలా సంతోషాన్ని ఇచ్చింది: డిప్యూటీ సీఎం

రెండో విడత రుణమాఫీ చాలా సంతోషాన్ని ఇచ్చిందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా రైతుల ఖాతాల్లోకి డబ్బులు జమ అవుతున్నాయని మంగళవారం మీడియాతో తెలిపారు. వరంగల్ రైతు డిక్లరేషన్‌లో చెప్పినట్టు మాఫీ చేస్తున్నామన్నారు. డిక్లరేషన్ ప్రకటించినప్పుడు చాలామంది అనుమానాలను వ్యక్తం చేశారన్నారు. బీఆర్ఎస్ రూ.లక్ష రుణమాఫీ నాలుగు విడతలుగా చేసిందని.. చివరి విడత సగం వదిలేసిందన్నారు.
Similar News
News September 13, 2025
ఖమ్మం: కాంగ్రెస్‌లో వర్గపోరు.. పరస్పరం దాడులు

బోనకల్ మండలంలో కాంగ్రెస్ పార్టీలో వర్గపోరు భగ్గుమంది. గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద రెండు వర్గాల నాయకుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. పరస్పరం దాడులు చేసుకున్నారు. ఈ దాడిలో ఒక వ్యక్తి చెవి తెగిపోగా, మరొకరిని మహిళలు చెప్పులతో కొట్టి గాయపరిచారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. ఇరు వర్గాల వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
News September 13, 2025
ఖమ్మం: పత్తి కొనుగోళ్లపై అదనపు కలెక్టర్ ఆదేశాలు

ఖమ్మం జిల్లాలో పత్తి రైతులకు ఇబ్బందులు లేకుండా మద్దతు ధరతో కొనుగోళ్లు జరగాలని అ.కలెక్టర్ శ్రీనివాస రెడ్డి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో పత్తి కొనుగోళ్లపై సీసీఐ అధికారులతో సమావేశం నిర్వహించారు. జిల్లాలో 2,25,613 ఎకరాల్లో పత్తి సాగు చేశారని, 27,07,356 క్వింటాళ్ల దిగుబడి వస్తుందని అంచనా వేసినట్లు తెలిపారు. జిల్లాలో 5సిసిఐ కేంద్రాలు, 9 జిన్నింగ్ మిల్లుల వద్ద కొనుగోళ్లు జరుగుతాయని పేర్కొన్నారు.
News September 12, 2025
రెసిడెన్షియల్ పాఠశాలల అభివృద్ధిపై సమీక్ష

ఖమ్మం జిల్లాలోని వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాలల అభివృద్ధిపై అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజ సమీక్ష నిర్వహించారు. వెల్ఫేర్ అధికారులతో ఆమె శుక్రవారం సమావేశమయ్యారు. పాఠశాలల్లో మౌలిక వసతులు, విద్యార్థులకు నాణ్యమైన విద్య, సౌకర్యాల కల్పనపై సమగ్రంగా చర్చించారు. పాఠశాలల పనితీరును బలోపేతం చేయాలని, ఉపాధ్యాయులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఆమె ఆదేశించారు.