News July 30, 2024
మనూ భాకర్‌ను అభినందించిన PM, AP CM

పారిస్ ఒలింపిక్స్‌లో రెండు పతకాలు సాధించిన భారత షూటర్ మనూ భాకర్‌ను PM మోదీ, ఏపీ CM చంద్రబాబు అభినందించారు. ఈ విజయం ఆమె అంకిత భావానికి నిదర్శమని మోదీ ప్రశంసించారు. 10M ఎయిర్ పిస్టల్ మిక్స్‌డ్ విభాగంలో సరబ్‌జోత్‌తో కలిసి మనూ కాంస్యం గెలవడం అభినందనీయమన్నారు. అటు 124ఏళ్ల చరిత్రలో ఓ భారత ఒలింపియన్ ఒకే ఒలింపిక్స్‌లో రెండు పతకాలు సాధించడం ఇదే తొలిసారి అని CBN కొనియాడారు.
Similar News
News November 4, 2025
వరి పంటను ముందే కోస్తే ఏం జరుగుతుంది?

వరి పంటను ముందుగా కోసినట్లయితే ధాన్యంలో పచ్చి గింజలు ఎక్కువగా ఉంటాయి. అంతేగాక, కంకిలోని చివరి గింజలు పూర్తిగా నిండుకోక చాలా సన్నగా పొట్ట తెలుపు కలిగి ఉంటాయి. దీని వల్ల మిల్లింగ్ చేసినప్పుడు నిండు గింజల దిగుబడి తగ్గి అధికంగా నూక, తౌడు వస్తాయి. గింజలో తేమ శాతం కూడా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఒకవేళ పంటను సకాలంలో కోత కోయక పోతే గింజలు ఎక్కువగా ఎండి రాలిపోవడమే కాకుండా పగుళ్లు ఏర్పడతాయి.
News November 4, 2025
రేపు కార్తీక పౌర్ణమి.. ఇలా చేస్తే?

ఇవాళ రా.10.30 నుంచి రేపు సా.6.48 వరకు పౌర్ణమి తిథి ప్రభావం ఉంటుందని పండితులు చెబుతున్నారు. సూర్యోదయం నుంచి సాయంత్రం వరకు తిథి ప్రభావం ఎక్కువగా ఉండటంతో రేపు వ్రతం చేసుకోవాలని సూచిస్తున్నారు. రేపు ఉ.4:52-5.44 వరకు నదీ స్నానం చేసి కార్తీక దీపాలు వెలిగించాలి. సా.5.15-7.05 వరకు దీపారాధాన చేసేందుకు మంచి సమయమని చెబుతున్నారు. ఈ రోజున 365 వత్తులతో దీపారాధన చేస్తే దోషాన్ని నివారించవచ్చని సూచిస్తున్నారు.
News November 4, 2025
మృతదేహాలకు కనీస గౌరవం ఇవ్వరా: KTR

నిన్న మీర్జాగూడ బస్సు ప్రమాదంలో మరణించిన వారి మృతదేహాలను టోయింగ్ వ్యాన్‌లో తరలించడంపై మాజీ మంత్రి కేటీఆర్ ఫైరయ్యారు. ‘మరణంలోనూ కనీస గౌరవం లేకపోవడం బాధాకరం. రాష్ట్రంలో అంబులెన్స్‌లు / మార్చురీ వ్యాన్‌లు లేవా? చనిపోయిన వారికి & వారి కుటుంబాలకు కనీస గౌరవం ఇవ్వకుండా అమానవీయంగా ప్రవర్తించారు. తోపుడు బండ్లు, ట్రాక్టర్లు, చెత్త వ్యాన్లు, టోయింగ్ వాహనాలపై ఇలా తీసుకెళ్లడం ఏంటి’ అంటూ X వేదికగా మండిపడ్డారు.


