News July 30, 2024
అలా జరిగితేనే ధోనీ IPL ఆడుతాడు?

ఒక్కో ఫ్రాంచైజీ ఐదుగురు లేదా ఆరుగురిని రిటైన్ చేసుకునే అవకాశం ఉంటేనే ధోనీ IPL 2025 ఆడుతారని తెలుస్తోంది. ఒకవేళ నలుగురికే అవకాశం ఉంటే గైక్వాడ్, దూబే, జడేజా, పతిరణను CSK అట్టిపెట్టుకోనున్నట్లు టాక్. ఐదుగురిని అనుమతిస్తే ధోనీని కూడా రిటైన్ చేసుకోనుందట. రేపు జరిగే BCCI-IPL మీటింగ్‌లో దీనిపై క్లారిటీ రానుంది. కాగా ఆడితే CSK తరఫునే ఆడాలని, లేదంటే IPLకు గుడ్ బై చెప్పాలని మహీ యోచిస్తున్నట్లు సమాచారం.
Similar News
News November 5, 2025
ఎస్‌బీఐ క్లర్క్ ప్రిలిమ్స్ ఫలితాలు విడుదల

క్లర్క్ పోస్టుల భర్తీకి నిర్వహించిన ప్రిలిమినరీ ఎగ్జామ్ ఫలితాలను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రిలీజ్ చేసింది. మెయిన్స్‌కు ఎంపికైన వారి వివరాల పీడీఎఫ్‌ను వెబ్‌సైట్‌లో ఉంచినట్లు తెలిపింది. 6,589 జూనియర్ అసోసియేట్స్ పోస్టులకు సెప్టెంబర్ 20, 21, 27 తేదీల్లో పరీక్షలు నిర్వహించింది. ఫలితాల కోసం ఇక్కడ <
News November 4, 2025
‘ఇండియా’ గ్లోబల్ సూపర్ పవర్: ఇజ్రాయెల్ మంత్రి

ఇండియా ‘గ్లోబల్ సూపర్ పవర్’ కంట్రీ అని ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రి గిడియోన్ సర్ అభివర్ణించారు. 2 దేశాల సంబంధాలు గతంలో కన్నా మరింత బలపడ్డాయని NDTVతో చెప్పారు. డిఫెన్స్, ట్రేడ్, కౌంటర్ టెర్రరిజమ్, ట్రేడ్‌లలో తమ బంధాన్ని విస్తరించామన్నారు. హమాస్ దాడి సమయంలో మద్దతుగా నిలిచిన ఇండియాను ఎప్పుడూ గుర్తుంచుకుంటామని తెలిపారు. తమకు ముప్పుగా ఉన్న పాలస్తీనాను ప్రత్యేక దేశంగా గుర్తించలేమన్నారు.
News November 4, 2025
‘నీ కోసం నా భార్యను చంపేశా’.. మహిళలకు ఫోన్‌పేలో మెసేజ్

బెంగళూరులో కృతికా రెడ్డి అనే డాక్టర్ హత్య కేసులో సంచలన విషయం వెలుగులోకొచ్చింది. అధిక మోతాదులో మత్తు మందు ఇచ్చి ఆమెను హత్య చేసిన కేసులో భర్త మహేంద్రా రెడ్డి గత నెలలో అరెస్టయ్యాడు. ‘నీ కోసం నా భార్యను చంపేశా’ అని ఐదుగురు మహిళలకు ఫోన్‌పేలో అతడు మెసేజ్ చేశాడని పోలీసులు వెల్లడించారు. ఏప్రిల్‌లో హత్య తర్వాత కొన్నాళ్లకు ఇలా చేశాడని, పాత బంధాలను తిరిగి కొనసాగించేందుకు తీవ్రంగా ప్రయత్నించాడని చెప్పారు.


