News July 30, 2024
ఆగస్టు 15 నుంచి వైద్య సేవలు నిలిపివేస్తాం: ఆస్పత్రుల సంఘం

AP: తమకు రావాల్సిన బకాయిలను చెల్లించకపోతే ఆగస్టు 15 నుంచి వైద్య సేవలు నిలిపివేయాలని స్పెషాలిటీ ఆస్పత్రుల సంఘం నిర్ణయించింది. దీనిపై ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్ట్ సీఈవోకు లేఖ రాసింది. దాదాపు రూ.2,500కోట్ల బకాయిలు రావాల్సి ఉందని, ప్రతి నెలా రూ.250కోట్లు అదనంగా కలుస్తున్నట్లు పేర్కొంది. గత 8 నెలల నుంచి బిల్లులు చెల్లించకపోవడంతో ఆస్పత్రుల నిర్వహణ కష్టంగా మారిందని తెలిపింది.
Similar News
News March 6, 2025
బిగ్‌బాస్ సీజన్-9కు కొత్త హోస్ట్?

టీవీ రియాలిటీ షో ‘బిగ్ బాస్’ తెలుగులో 8 సీజన్లు పూర్తి చేసుకుంది. త్వరలో తొమ్మిదో సీజన్ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. అయితే ఈసారి అక్కినేని నాగార్జున హోస్ట్‌గా ఉండకపోవచ్చని సమాచారం. ఎనిమిదో సీజన్‌కు ఆశించిన స్థాయిలో ప్రేక్షకాదరణ లేకపోవడంతో హోస్ట్‌గా ఉండకూడదని ఆయన నిర్ణయించుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీనిపై అధికారికంగా స్పష్టత రావాల్సి ఉంది. మరి ఈ షోను ఎవరు హోస్ట్ చేస్తే బాగుంటుందో కామెంట్ చేయండి.
News March 6, 2025
విశాఖ, విజయవాడ మెట్రోలపై చర్చించా: సీఎం

ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీలో కేంద్రమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్‌తో భేటీ అయ్యారు. రాష్ట్రంలో సామాజిక, ఆర్థిక అభివృద్ధికి సంబంధించిన ముఖ్యమైన ప్రాజెక్టులపై చర్చించానని సీఎం ట్వీట్ చేశారు. విశాఖ, విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టులపై సమాలోచనలు చేశామన్నారు. ఇవి రాష్ట్ర ప్రజలకు ఎంతో ప్రయోజనకరమని, ఆర్థికాభివృద్ధికి దోహదపడతాయని వివరించారు.
News March 6, 2025
ఏపీకి ఏ లోటు లేకుండా చూస్తాం: నిర్మల

APకి ఏ లోటు లేకుండా చూస్తామని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ హామీ ఇచ్చారు. ఇవాళ విశాఖపట్నంలో పర్యటించిన ఆమె మాట్లాడుతూ.. ఇప్పటికే విశాఖ స్టీల్ ప్లాంట్‌కు ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చామన్నారు. అమరావతి నిర్మాణానికి రుణాలు ఇప్పిస్తున్నామని వెల్లడించారు. ఇండస్ట్రియల్ కారిడార్ అభివృద్ధికి సాయం చేస్తున్నట్లు వివరించారు. రాష్ట్ర అభివృద్ధికి అన్నింటా కేంద్ర ప్రభుత్వ సంపూర్ణ సహకారం ఉంటుందని స్పష్టం చేశారు.