News July 30, 2024

నేను పార్టీ మారటం లేదు: తెల్లం వెంకట్రావు

image

TG: బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నట్లు వచ్చిన వార్తలను భద్రాచలం కాంగ్రెస్ ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు ఖండించారు. తాను పార్టీ మారడం లేదని, కావాలనే తనపై దుష్ప్రచారం చేస్తున్నారని మీడియాతో అన్నారు. అసెంబ్లీ లాబీలో బీఆర్ఎస్ నేతలతో కూర్చొని టీ తాగితే ఆ ఫొటోలు తీసి వైరల్ చేశారని మండిపడ్డారు.

Similar News

News January 23, 2026

త్వరలో బీజేపీలోకి శశిథరూర్?

image

కేరళ అసెంబ్లీ ఎన్నికలపై కాంగ్రెస్ హైకమాండ్ ఢిల్లీలో నిర్వహించిన కీలక భేటీకి పార్టీ MP శశిథరూర్ గైర్హాజరయ్యారు. అదే సమయంలో తిరువనంతపురంలో జరిగిన PM మోదీ సమావేశానికి హాజరయ్యారు. ఇప్పటికే మోదీ పాలనను ప్రశంసించిన థరూర్‌ను INC దూరం పెట్టినట్లు ప్రచారం ఉంది. ఇటీవల రాహుల్ ఓ ప్రసంగంలో తన పేరును విస్మరించడంతో థరూర్ అసంతృప్తిగానూ ఉన్నారు. ఈ పరిణామాలతో ఆయన త్వరలోనే BJPలో చేరొచ్చన్న ఊహాగానాలు ఊపందుకున్నాయి.

News January 23, 2026

సింగరేణి టెండర్లపై విచారణ కోరుతూ కిషన్ రెడ్డికి హరీశ్ లేఖ

image

TG: నైనీ కోల్ స్కామ్‌పై విచారణ జరపాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి BRS MLA, మాజీ మంత్రి హరీశ్ రావు లేఖ రాశారు. సింగరేణిలో అన్ని టెండర్లను రద్దు చేయాలని కోరారు. సింగరేణి టెండర్లపై సుప్రీంకోర్టు లేదా హైకోర్టు జడ్జితో విచారణ జరిపించాలని లేఖలో పేర్కొన్నారు. జడ్జితో కుదరకపోతే సీబీఐతో దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు. CM రేవంత్ సింగరేణిలో మరో <<18937157>>3 స్కామ్‌లకు<<>> పాల్పడ్డారని హరీశ్ ఆరోపించారు.

News January 23, 2026

చిరు వ్యాపారులకు స్వనిధి క్రెడిట్ కార్డులు

image

వీధి వ్యాపారుల కోసం కేంద్ర ప్రభుత్వం ‘స్వనిధి క్రెడిట్ కార్డు’లను అందుబాటులోకి తెచ్చింది. ఈ కార్డులను పీఎం మోదీ ఈరోజు కేరళలో లాంచ్ చేశారు. <<17535471>>పీఎం స్వనిధి స్కీమ్‌<<>>లో భాగంగా రెండో విడత లోన్ తీసుకుని సకాలంలో చెల్లించిన వ్యాపారులకు ఈ క్రెడిట్ కార్డు ఇస్తారు. ఇది UPI లింక్డ్ రూపే క్రెడిట్ కార్డు. మ్యాగ్జిమమ్ లిమిట్ రూ.30వేలు. వ్యాలిడిటీ 5ఏళ్లు ఉంటుంది. కార్డు కోసం లోన్ ఇచ్చిన బ్యాంకులో సంప్రదించాలి.