News July 30, 2024

రంపచోడవరం MLA సొంత డబ్బులతో అంబులెన్స్ సిద్ధం

image

ఆపదలో ఉన్న వారికి వైద్యసహాయం అందించేందుకు రంపచోడవరం ఎమ్మెల్యే శిరీషా దేవి సొంత సొమ్ముతో అంబులెన్స్ అందుబాటులోకి తీసుకొస్తానని వెల్లడించిన విషయం తెలిసిందే. కాగా హామీ ఇచ్చిన కొన్ని గంటల్లోనే సిద్ధం చేశారు. ప్రస్తుతం అంబులెన్సు వాహనాన్ని అన్నీ రకాలుగా తీర్చిదిద్దుతున్నట్లు టీడీపీ నేత భాస్కర్ తెలిపారు. ఆగస్టు 9న ప్రపంచ ఆదివాసీ దినం సందర్భంగా ఈ అంబులెన్స్‌ను MLA శిరీషా దేవి ప్రారంభిస్తారని తెలిపారు.

Similar News

News March 1, 2026

రేపు PGRS, రెవిన్యూ క్లినిక్: కలెక్టర్ కీర్తి

image

రాజమండ్రి కలెక్టరేట్లో సోమవారం PGRS, రెవెన్యూ క్లినిక్‌లను యథావిధిగా నిర్వహించనున్నట్లు కలెక్టర్ కీర్తి చేకూరి ప్రకటించారు. అర్జీదారులు తమ అర్జీలను Meekosam.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చని తెలిపారు. అర్జీల నమోదు, నమోదైన అర్జీల స్థితి తదితర వివరాలకు 1100కు కాల్ చేయవచ్చని కలెక్టర్ సూచించారు.

News March 1, 2026

తూ.గో: ఇక ఆన్‌లైన్‌లో రవాణా సేవలు

image

రవాణాశాఖకు సంబంధించిన అన్ని సేవలు ప్రస్తుతం ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉన్నాయని తూ.గో రవాణాధికారి ఆర్. సురేశ్ శనివారం తెలిపారు. డ్రైవింగ్ లైసెన్సుల కోసం ‘Sarathi Parivahan’ వెబ్‌సైట్‌ను సంప్రదించాలని సూచించారు. వాహనాల రిజిస్ట్రేషన్, టాక్స్ చెల్లింపుల వంటి సేవలను ‘Vahan Parivahan’ పోర్టల్ ద్వారా పొందవచ్చని వెల్లడించారు. ఇంటి నుంచే పనులు పూర్తి చేసుకోవచ్చని పేర్కొన్నారు.

News February 28, 2026

RJY: ట్రంప్ తీరుపై సీపీఐ నారాయణ ధ్వజం

image

అమెరికా విధానాలు, ట్రంప్ తీరు వల్ల దేశంలో వ్యవసాయం, చేనేత రంగాలు నాశనమవుతున్నాయని CPI నేత కె.నారాయణ విమర్శించారు. శనివారం రాజమండ్రిలో ఆయన మాట్లాడారు. మోదీ ప్రభుత్వం ట్రంప్‌‌నకు బానిసగా మారిందని మండిపడ్డారు. సామాన్యులను వదిలేసి కార్పొరేట్లకు కోట్లాది రూపాయల రుణాలు మాఫీ చేస్తూ ఊడిగం చేస్తున్నారని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వ వైఖరి వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.