News July 30, 2024
పారిస్ ఒలింపిక్స్: ప్రీ క్వార్టర్స్‌కు భారత ఆర్చర్

ఆర్చరీ మహిళల వ్యక్తిగత విభాగంలో భారత ఆర్చర్ భజన్‌కౌర్ ప్రీ క్వార్టర్స్‌కు చేరుకున్నారు. ఇవాళ జరిగిన రెండు వరుస గేముల్లో విజయం సాధించారు. తొలుత ఇండోనేషియన్ ఆర్చర్‌పై 7-3 తేడాతో గెలిచి 32 రౌండ్‌కు చేరుకున్న ఆమె, ఆ తర్వాత పోలిష్ ఆర్చర్‌పై 6-0తో నెగ్గి రౌండ్ 16కి అర్హత సాధించారు. #OLYMPICS2024
Similar News
News April 10, 2026
IPL నుంచి హసరంగ ఔట్!

LSG స్టార్ స్పిన్నర్ హసరంగ గాయం కారణంగా ఐపీఎల్‌కు దూరమయ్యారు. ఆయన భారత్‌కు రాలేడనే అంచనాతో ఒకట్రెండు రోజుల్లో వేరే ప్లేయర్‌ను తీసుకోనున్నట్లు టీమ్ డైరెక్టర్ టామ్ మూడీ ప్రకటించారు. గతేడాది వేలంలో హసరంగను రూ.2 కోట్లకు LSG కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. గాయంతో బాధపడుతున్న ఆయన శ్రీలంక బోర్డు నుంచి NOC పొందలేదు. హసరంగ స్థానంలో దక్షిణాఫ్రికా స్పిన్నర్ జార్జ్ లిండేను తీసుకునే అవకాశం ఉంది.
News April 10, 2026
ఈ నెలాఖరులోగా ఆస్తి పన్ను చెల్లిస్తే 5 శాతం రాయితీ

AP: మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, నగర పంచాయతీల్లో 2026-27 ఏడాదికి సంబంధించిన ఆస్తి పన్నుపై ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఈ నెలాఖరులోగా చెల్లిస్తే 5 శాతం రాయితీ ఇస్తామని ప్రకటించింది. అలాగే 2025-26 వరకు ఉన్న ఆస్తి పన్ను బకాయిలపై 50 శాతం వడ్డీ మాఫీ సదుపాయాన్ని ఈ నెలాఖరు వరకు పొడిగించింది. ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని అధికారులు సూచించారు.
News April 10, 2026
రైతు భరోసా రెండో విడతపై అప్‌డేట్

TG: రైతు భరోసా రెండో విడత సాయాన్ని ఈ నెల 22లోపు అందించేందుకు ప్రభుత్వం నిధులు సిద్ధం చేస్తోంది. ఈ విడతలో 5 ఎకరాల వరకు భూమి ఉన్న రైతులకు నగదు జమ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. అలాగే మూడో విడత సాయాన్ని ఈ నెలాఖరులోగా జమ చేయొచ్చని తెలుస్తోంది. కాగా గత నెల 23న తొలి విడత కింద ఒక ఎకరం భూమి వరకు రూ.6,000 చొప్పున సాయం అందించిన విషయం తెలిసిందే.


