News July 30, 2024

వెంకటరావు ఎక్కడికీ వెళ్లరు: మంత్రి పొంగులేటి

image

TG: భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకటరావు BRSలోకి వెళ్తారనే ప్రచారాన్ని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఖండించారు. ‘వెంకటరావు కాంగ్రెస్ పార్టీలోనే ఉంటారు. పాత పరిచయం కాబట్టి BRS వాళ్లను కలిసి ఉంటారు. మా దగ్గరకు వచ్చిన వాళ్లకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. కాంగ్రెస్ దగ్గర ప్రేమ రాజకీయాలు ఉంటాయి. వెంకటరావే కాదు ఎవరూ ఎక్కడికీ వెళ్లరు’ అని వ్యాఖ్యానించారు.

Similar News

News April 19, 2026

PGRS సమయాల్లో మార్పు: నంద్యాల కలెక్టర్

image

వేసవి దృష్ట్యా సోమవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో సమయాన్ని మార్చినట్లు కలెక్టర్ రాజకుమారి పేర్కొన్నారు. జిల్లాలో ప్రస్తుతం అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్న సందర్భంగా ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 1 వరకు కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. ఈ విషయాన్ని ప్రజలు గమనించాలని కోరారు. ప్రజలు తమ అర్జీలను meekosam.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా కూడా ఇవ్వచ్చన్నారు.

News April 19, 2026

నితీశ్ బౌలింగ్ వెనుక స్టీఫెన్ జోన్స్?

image

తన బౌలింగ్ మెరుగవడం వెనుక ఓ స్పెషల్ పర్సన్ ఉన్నారని, ఆయనెవరో ఇప్పుడే చెప్పనని ఇటీవల ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ తెలిపారు. అయితే బౌలింగ్ కోచ్ స్టీఫెన్ జోన్స్(UK) పర్యవేక్షణలో NKR ట్రైనింగ్ తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. బెంగళూరులోని పదుకొణె-ద్రవిడ్ స్పోర్ట్స్ ఎక్సలెన్స్‌లో వారంపాటు ఈ సెషన్ జరిగినట్లు సమాచారం. నితీశ్ స్పీడ్ గతంలో 120-125Kmph ఉండగా ఇప్పుడు 135-139Kmph వేస్తూ వికెట్లు తీస్తున్నారు.

News April 19, 2026

భారత్-అమెరికా ట్రేడ్ డీల్‌పై రేపటి నుంచి చర్చలు!

image

USతో ట్రేడ్ డీల్ తొలి ఫేజ్ అమలుపై భారత్ ఆ దేశంతో రేపటి నుంచి మూడు రోజుల పాటు చర్చలు జరపనుంది. ట్రంప్ టారిఫ్స్‌ను ఆ దేశ సుప్రీంకోర్టు కొట్టివేసిన తర్వాత తొలిసారిగా భారత్ బృందం వాషింగ్టన్‌కు చర్చలకు వెళ్లనుంది. దీంతో ఈ సమావేశాలకు ప్రాధాన్యం సంతరించుకుంది. భారత్ సహా 16 దేశాల వాణిజ్యంపై ట్రంప్ దర్యాప్తునకు ఆదేశించడంపైనా ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం ఇండియా USకు 10% టారిఫ్ చెల్లిస్తోంది.