News July 30, 2024
అమలాపురం: ఆన్‌లైన్‌లో బెట్టింగ్.. ఐదుగురు అరెస్ట్

ఆన్‌లైన్‌లో బెట్టింగ్ గేమ్ నిర్వహిస్తున్న ఐదుగురు సభ్యుల ముఠాను అమలాపురం పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. సీఐ క్రిస్టోఫర్ మాట్లాడుతూ.. పట్టణంలోని ఆర్టీసీ బస్ కాంప్లెక్స్ వద్ద అంబికా లాడ్జిలో బెట్టింగ్ ముఠాను అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. ఐదుగురిని అరెస్ట్ చేసి ఐదు లాప్టాప్‌లు, 75 మొబైల్ ఫోన్లు, చెక్ బుక్కులు, 25 ఏటీఎం కార్డులు స్వాధీనం చేసుకున్నామన్నారు.
Similar News
News February 18, 2026
RJY: టెన్త్ పరీక్షలు రాయబోతున్నారా? ఈ వివరాలు మీ కోసమే!

మార్చి 16 నుంచి ఏప్రిల్ 1 వరకు జరిగే టెన్త్ పరీక్షలకు 24,538 మంది విద్యార్థులు హాజరుకానున్నట్లు డీఈవో కె. వాసుదేవరావు ప్రకటించారు. అందులో 12,555 మంది బాలురు, 11,983 మంది బాలికలు పరీక్షలకు సన్నద్ధంగా ఉన్నారన్నారు. టెన్త్ పరీక్షలు ఉదయం 9.30 గంటల నుండి మధ్యాహ్నం 12.45 గంటల వరకు షెడ్యూల్ ప్రకారం నిర్వహిస్తామని చెప్పారు. పరీక్షలు ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకుంటామన్నారు.
News February 17, 2026
రాజమండ్రి: టెన్త్ పరీక్షలను పగడ్బందీగా నిర్వహించాలి- డీఆర్ఓ

పదవ తరగతి పబ్లిక్ పరీక్షల నిర్వహణపై మంగళవారం బొమ్మూరులోని జిల్లా కలెక్టరేట్‌లో పబ్లిక్ పరీక్షలపై సమన్వయ శాఖల అధికారులతో సమీక్షా సమావేశం జరిగింది. పరీక్షల నిర్వహణలో ఎటువంటి లోపాలు లేకుండా అన్ని శాఖలు సమన్వయంతో పని చేయాలని డీఆర్ఓ టి. సీతారామ మూర్తి దిశానిర్దేశం చేశారు. పరీక్షా కేంద్రాల వద్ద తాగునీరు, విద్యుత్, శానిటేషన్, భద్రతా ఏర్పాట్లు పక్కాగా ఉండాలని డిఆర్ఓ సూచించారు.
News February 17, 2026
వికసిత్ భారత్‌కు బడ్జెట్-2026 బలమైన పునాది: పురందేశ్వరి

2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్య సాధనకు కేంద్ర బడ్జెట్-2026 దీర్ఘకాలిక పునాది వేస్తుందని ఎంపీ దగ్గుపాటి పురందేశ్వరి అన్నారు. మంగళవారం రాజమండ్రిలో నిర్వహించిన సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్స్ సమావేశంలో ఆమె మాట్లాడారు. ప్రధాని మోదీ నాయకత్వంలో జరుగుతున్న దేశాభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో సోషల్ మీడియా కీలక పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు.


