News July 30, 2024

బీటెక్ పూర్తి చేసిన వారికి 7,951 ఉద్యోగాలు

image

రైల్వేలో 7,951 జూనియర్ ఇంజినీర్ పోస్టులకు దరఖాస్తుల స్వీకరణ నేటి నుంచి ప్రారంభమైంది. ఇంజినీరింగ్ డిగ్రీ లేదా డిప్లొమా కలిగి ఉన్నవారు అప్లై చేసుకోవచ్చు. వయసు 18 నుంచి 36 ఏళ్లు. పోస్టును బట్టి జీతం నెలకు రూ.35,400 నుంచి రూ.44,900 వరకు ఉంది. చివరి తేదీ: ఆగస్టు 29. స్టేజ్-1, స్టేజ్-2 కంప్యూటర్ టెస్టులు, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటాయి. దరఖాస్తు చేసుకునేందుకు <>సైట్<<>>: https://www.rrbapply.gov.in/

Similar News

News April 10, 2026

మొజ్తబా సంచలన ప్రకటన

image

హార్ముజ్ జలసంధిపై ఎవరి నియంత్రణా ఉండొద్దని ట్రంప్ చెబుతున్న వేళ ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తబా సంచలన ప్రకటన చేశారు. ఆ జలసంధి నిర్వహణను మరో దశకు తీసుకెళ్తామన్నారు. తమపై దాడి చేసిన వారిని వదిలేది లేదని స్పష్టం చేశారు. తన తండ్రి అయతుల్లా ఖమేనీ మరణానికి, అమరవీరుల త్యాగాలకు ప్రతీకారం తీర్చుకుంటామని తెలిపారు. యుద్ధంతో జరిగిన నష్టానికి పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.

News April 10, 2026

ఆ బాధతో రోజూ ఫుల్ బాటిల్ తాగేవాడిని: ఆమిర్

image

తనను ఒంటరిగా వదిలి మొదటి భార్య రీనా దత్తా ఇద్దరు పిల్లలతో ఇంటి నుంచి వెళ్లిపోయినప్పుడు తీవ్రంగా కుంగిపోయానని ఆమిర్ ఖాన్ తెలిపారు. ఎమోషన్లను అదుపు చేసుకోలేక ఏడాదికిపైగా రోజూ ఒక ఫుల్ బాటిల్ మద్యం తాగేవాడినని ఓ ఇంటర్వ్యూలో గుర్తు చేసుకున్నారు. ఈ ఘటనకు ముందు తనకు లిక్కర్ అలవాటు లేదన్నారు. రీనాతో 2002లో, కిరణ్ రావుతో 2021లో ఆమిర్ డివోర్స్ తీసుకొన్నారు. ప్రస్తుతం గౌరీతో రిలేషన్‌లో ఉన్నారు.

News April 10, 2026

కన్నింగ్ పాక్ మధ్యవర్తిత్వం.. పరిష్కారం లభించేనా?

image

పాక్ వేదికగా US-ఇరాన్ మధ్య శాంతి చర్చలు ఇవాళ ప్రారంభం కానున్నాయి. హార్ముజ్‌పై నియంత్రణ, ఇరాన్ అణు కార్యక్రమంపై ఇరు పక్షాలు పట్టుబట్టే అవకాశం ఉంది. US ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ పాల్గొంటారు. అయితే నిలకడ లేని అమెరికా, టెంపరమెంట్‌తో ఊగిపోయే ఇరాన్ మధ్య కన్నింగ్ పాకిస్థాన్ చేస్తున్న మధ్యవర్తిత్వం ఫలితాన్నిస్తుందా లేక మధ్యలోనే ఆగిపోతుందా? అనేది కాలమే నిర్ణయించనుంది.