News July 30, 2024
కొండచరియలు ఎందుకు విరిగిపడతాయి?(1/2)

కొండలు వంటి ఎత్తైన ప్రాంతాల నుంచి రాళ్లు, మట్టి కిందకు జారిపడటాన్ని కొండచరియలు విరిగిపడటం అంటారు. ఏటవాలుగా ఉన్న ప్రాంతాల్లో ఇలా జరుగుతుంది. వర్షం, మంచు కరగడం, నీటి మట్టాల్లో మార్పులు, ప్రవాహాల వల్ల కోత, భూగర్భ జలాల్లో మార్పులు, భూకంపాలు, అగ్నిపర్వతాలు, మానవ కార్యకలాపాలు.. వంటివన్నీ కొండచరియలు విరిగిపడేందుకు కారణాలే. ఇందులో 5 రకాలుంటాయి. ఫాల్స్, టోపెల్స్, స్లైడ్స్, స్ప్రెడ్స్, ఫ్లోస్.
Similar News
News March 31, 2026
రేపటి నుంచి జాగ్రత్త!

APలో రేపటి నుంచి 4 రోజులపాటు అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముందని APSDMA వెల్లడించింది. రేపు పోలవరం(D) చింతూరు, కూనవరం మండలాల్లో తీవ్ర వడగాలులు వీస్తాయని తెలిపింది. విజయనగరం(D) బాడంగి, తెర్లాం, వంగర, మన్యం(D) గరుగుబిల్లి, గుమ్మలక్ష్మీపురం, జియ్యమ్మవలస, కొమరాడ, సీతానగరం మండలాల్లో వడగాలులు వీస్తాయంది. ఆవర్తన ప్రభావంతో ఉత్తరాంధ్రలో పిడుగులతో కూడిన వర్షాలకు ఛాన్స్ ఉందని పేర్కొంది.
News March 31, 2026
ప్రతి నెలా నాలుగో శనివారం హెల్త్ క్యాంపులు: సీఎం

AP: ప్రజలకు మెరుగైన ఆరోగ్యం కోసం ఉద్యమంలా కృషి చేయాలని CM CBN అధికారులను ఆదేశించారు. సంజీవని ప్రాజెక్టుపై సమీక్షలో మాట్లాడుతూ ‘ప్రజాప్రతినిధులు, కలెక్టర్లు, వైద్యాధికారులు జనాల్లోకి వెళ్లాలి. ప్రతి నాలుగో శనివారం స్వర్ణాంధ్ర పాపులేషన్ మేనేజ్‌మెంట్ పేరుతో గ్రామ సభలు, హెల్త్ క్యాంపులు నిర్వహించాలి. ఏడాదిలో 56L మందికి వైద్య పరీక్షలు చేయాలి. ఫలితాలను 48గంటల్లో వాట్సాప్ ద్వారా పంపాలి’ అని సూచించారు.
News March 31, 2026
ఆ దేశాలకు ట్రంప్ ఆప్షన్లు

హార్ముజ్‌లో నౌకల ప్రయాణానికి ఇబ్బంది లేకుండా చూస్తామని గతంలో పలు దేశాలకు హామీ ఇచ్చిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇప్పుడు మాట మార్చారు. ‘యుద్ధంలో పాల్గొనని UK లాంటి దేశాలకు రెండే ఆప్షన్లు ఉన్నాయి. మా దేశం నుంచి ఇంధనం కొనాలి. లేదంటే ధైర్యం తెచ్చుకొని సొంతంగా హార్ముజ్ నుంచి చమురు తెచ్చుకోవాలి. మీ కోసం మీరే పోరాడటం నేర్చుకోండి. అమెరికా మీకే సాయం చేయదు’ అని SMలో పోస్టు చేశారు.


