News July 30, 2024
CDPO, EO పోస్టుల ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల

TG: మహిళా, శిశు సంక్షేమ శాఖలో ఉద్యోగాల భర్తీకి పరీక్షల షెడ్యూల్‌ను ప్రభుత్వం ప్రకటించింది. CDPO అభ్యర్థులకు జనవరి 3, 4న, ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్(E0) అభ్యర్థులకు జనవరి 6, 7న పరీక్షలు ఉంటాయంది. గతేడాది నిర్వహించిన ఈ రెండు పరీక్షలను క్వశ్చన్ పేపర్ లీకేజీ కారణంగా టీజీపీఎస్సీ రద్దు చేసింది. 23 CDPO, 181 ఈవో పోస్టులను ఈ పరీక్ష ద్వారా భర్తీ చేయనున్నారు.
Similar News
News April 9, 2026
భారత తొలి టెస్ట్ విన్నింగ్ టీమ్ ఆఖరి ప్లేయర్ మృతి

భారత్ టెస్ట్ దిగ్గజం CD గోపీనాథ్ (96) కన్నుమూశారు. చెన్నైలోని తన కుమార్తె నివాసంలో తుదిశ్వాస విడిచారు. 1951-52లో ENGతో జరిగిన టెస్ట్ సిరీస్‌లో అరంగేట్రం చేసిన ఆయన సెకండ్ టెస్ట్‌లో 50, 42 స్కోర్స్ చేశారు. ఈ 5 మ్యాచుల టెస్ట్ సిరీస్‌లో IND చెన్నైలో జరిగిన ఆఖరి టెస్ట్‌లో గెలుపొంది తన తొలి టెస్ట్ విక్టరీ నమోదు చేసింది. ఆ జట్టులో ఇప్పటివరకు జీవించిన ఆఖరి ప్లేయర్ గోపీనాథ్ ఒక్కరే కావడం గమనార్హం.
News April 9, 2026
IMDb టాప్-5 బెస్ట్ IPL మ్యాచులివే..

ప్రముఖ ఎంటర్‌టైన్‌మెంట్ వెబ్‌సైట్ IMDb.. IPLలో టాప్-5 మ్యాచుల జాబితాను విడుదల చేసింది.
టాప్-1: 2019 MI-CSK థ్రిల్లింగ్ ఫైనల్ మ్యాచ్
టాప్-2: 2023లో GTపై KKR ప్లేయర్ రింకూ సింగ్ 5 సిక్సర్లు బాదిన గేమ్
టాప్-3: 2014లో RR విధించిన 190 రన్స్ టార్గెట్‌ను MI 14.4 ఓవర్లలోనే ఛేదించిన మ్యాచ్
టాప్-4: 2017 ఫైనల్లో RPSపై ఒక్క రన్ తేడాతో గెలిచిన MI మ్యాచ్
టాప్-5: 2023 ఫైనల్లో GTపై CSK థ్రిల్లింగ్ విక్టరీ
News April 9, 2026
తక్కువే తిన్నా బరువు తగ్గట్లేదా?

తక్కువ తింటున్నా, వ్యాయామం చేస్తున్నా బరువు తగ్గట్లేదని కొందరు బాధపడుతుంటారు. అయితే వెయిట్ లాస్ వీటిపైనే ఆధారపడదని వైద్యులు చెబుతున్నారు. ‘ఎక్సర్ సైజ్ తర్వాత ఒకేచోట కదలకుండా ఉండటం కారణం కావొచ్చు. సరైన నిద్ర లేకపోవడం వల్ల అధిక క్యాలరీలు తీసుకోవడమూ మరో కారణం. అలాగే ప్రాసెస్ చేసిన ఫుడ్ కూడా బరువు తగ్గడానికి అడ్డుపడుతుంది. కొన్ని వ్యాధులకు వాడే మందులూ శరీర కొవ్వు తగ్గడాన్ని ఆపుతాయి’ అని అంటున్నారు.


