News July 30, 2024
HYD: BRSలోకి కాంగ్రెస్ MLA.. క్లారిటీ

సోషల్ మీడియా వేదికగా తనపై తప్పుడు వార్తలు సృష్టిస్తున్నారని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. అటువంటి వార్తలను నమ్మొద్దని తాజాగా ఓ ప్రకటన విడుదల చేశారు. ఇటీవల కొంతమంది ఎమ్మెల్యేలు బీఆర్‌ఎస్‌ను వీడి కాంగ్రెస్‌లో చేరారు. మళ్లీ ఈ ఎమ్మెల్యేలు తిరిగి సొంత గూటికి చేరుతున్నారని వార్తలు వస్తున్నట్లు గుర్తు చేశారు. కానీ, ఆ జాబితాలో తాను లేనన్నారు. కాంగ్రెస్‌లోనే ఉంటానని కాలే యాదయ్య స్పష్టం చేశారు.
Similar News
News October 30, 2025
జూబ్లీ ‘ఓటర్ థింక్’ డిఫరెంట్

ఎన్నికలొస్తే సికింద్రాబాద్ ‘లోక్ నాడీ’ అంతుచిక్కడం లేదు. GHMC, అసెంబ్లీ ఎన్నికల్లో ఓ పార్టీకి, MP ఎన్నికల్లో ఇంకో పార్టీకి ఓటేస్తారు. విచిత్రం ఏంటంటే.. గతంలో లోక్‌సభ పరిధిలో అందరూ BRS MLAలే ఉన్నా MP స్థానం BJP గెలిచింది. 2వ స్థానంలో INC వస్తుందని ఎవరూ ఊహించలేదు. ప్రస్తుతం జూబ్లీహిల్స్ బైపోల్ ముంగిట పబ్లిక్ పల్స్ ప్రశ్నగా మారింది. ఎన్నికకో సర్ప్రైజ్ ఇచ్చే జనం ఈసారి ఏం చేస్తారో వేచిచూడాలి.
News October 30, 2025
హైదరాబాద్‌లో నేటి వాతావరణం ఇలా

హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఈరోజు పాక్షికంగా ఆకాశం మేఘావృతంగా ఉంటుందని వాతావరణ కేంద్రం తెలిపింది. ‘సాయంత్రం లేదా రాత్రి సమయంలో నగరంలోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షం, చిరు జల్లులు పడే అవకాశం ఉంది. ఉదయం, రాత్రి వేళల్లో పొగమంచు కనిపించే అవకాశం ఉంది. గరిష్ఠ ఉష్ణోగ్రత 29°C, కనిష్ఠ ఉష్ణోగ్రత 21°Cగా నమోదయ్యే అవకాశం ఉంది. నైరుతి దిశలో గంటకు 04- 08 కి.మీ వేగంతో గాలులు వీస్తాయి’ అని పేర్కొంది.
News October 30, 2025
కోల్కత్తాలో తప్పించుకున్నా శంషాబాద్లో దొరికాడు

విశాల్ అనే వ్యక్తి కోల్కత్తా నుంచి ఇండిగో విమానంలో శంషాబాద్ వచ్చాడు. ఆ తర్వాత అతడు మరో విమానంలో బెంగళూరు వెళ్లేందుకు సిద్ధమవుతున్నాడు. ఈ క్రమంలో అతడి లగేజీని భద్రతా సిబ్బంది తనిఖీ చేయగా బుల్లెట్ (38MM లైవ్ బుల్లెట్ ) బయటపడింది. దాని గురించి వివరాలు అడగ్గా సరైన సమాధానం లేదు. దీంతో ఆర్జీఐఏ పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని విచారణ ప్రారంభించారు.


