News July 30, 2024
ఎస్సీల కోసం కొత్త పథకాలు రూపొందించాలి: సీఎం

AP: ఎస్సీలకు ఆర్థిక భద్రత కల్పించే కార్యక్రమాలు రూపొందించాలని అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. సాంఘిక సంక్షేమ శాఖపై సీఎం సమీక్ష నిర్వహించారు. 2014-2019 మధ్య కాలంలో అమలు చేసిన అంబేడ్కర్ ఓవర్సీస్ విద్యానిధి, ఎన్టీఆర్ విద్యోన్నతి, బెస్ట్ అవైలబుల్ స్కూళ్లు, చంద్రన్న పెళ్లికానుక లాంటి పథకాలను గత ప్రభుత్వం నిలిపివేసిందని గుర్తు చేశారు. వాటితో పాటు మరిన్ని కొత్త పథకాలు రూపొందించాలని ఆదేశించారు.
Similar News
News April 9, 2026
విద్యార్థులకు పాలు.. రూ.120 కోట్ల ఆర్డర్

TG: ప్రభుత్వ విద్యాసంస్థల్లో ఒకటో తరగతి నుంచి ఇంటర్ వరకు చదివే విద్యార్థులకు బ్రేక్‌ఫాస్ట్, పాలను ప్రభుత్వం అందజేయనుంది. ఇందులో భాగంగా పాల సరఫరా కోసం విజయ డెయిరీకి రూ.120 కోట్ల ఆర్డర్ ఇచ్చింది. జూన్‌లో స్కూళ్లు తెరిచేనాటికి 150-200ML టెట్రా ప్యాకెట్లను సిద్ధంగా ఉంచుతామని డెయిరీ అధికారులు వెల్లడించారు. కాగా వారానికి 3 రోజులు పాలు, మూడు రోజులు రాగి జావను ప్రభుత్వం అందించనుంది.
News April 9, 2026
టీవీ యూజర్లకు యూట్యూబ్ షాక్!

TV యూజర్లకు షాక్ ఇచ్చేందుకు యూట్యూబ్ రెడీ అవుతోంది. టీవీల్లో స్కిప్ చేసేందుకు వీలు లేకుండా 90 సెకన్లపాటు Unskippable యాడ్స్ వేయనుందని తెలుస్తోంది. ప్రస్తుతం దీన్ని టెస్ట్ చేస్తోందని ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నారు. యూజర్లను ప్రీమియం వైపు మళ్లించి, రెవెన్యూ పెంచుకునే చర్యల్లో భాగంగా యూట్యూబ్ ఈ చర్యలు చేపట్టిందని అంటున్నారు. మరోవైపు జియో హాట్ స్టార్ సహా పలు OTT యాప్స్ కూడా ఇదే ఫార్ములా ఫాలో అవుతున్నాయి.
News April 9, 2026
ఎర్రటి ఎండలో YS పాదయాత్ర.. గుర్తు చేసుకున్న జగన్

AP: YSR పాదయాత్రకు నేటికి 23 ఏళ్లు అయిన సందర్భంగా జగన్ గుర్తు చేసుకున్నారు. ‘నాకు బాగా గుర్తు APR 9, 2003లో ఎర్రటి ఎండలో ప్రజల కష్టాల్లో పాలుపంచుకునేందుకు నాన్న చేపట్టిన పాదయాత్ర ప్రజల్లో ధైర్యం నింపింది. నాన్నకు రాష్ట్రమంతా మద్దతుగా నిలిచి CMని చేసింది. సీఎం కాగానే ఉచిత విద్యుత్ ఫైల్‌పై తొలి సంతకం చేశారు. ఎన్నో సంస్కరణలు, పథకాలు రాష్ట్ర రూపురేఖలనే మార్చేశాయి’ అని ట్వీట్ చేశారు.


