News July 30, 2024
ఒలింపిక్స్‌లో ఇండివిడ్యువల్‌గా పాల్గొనవచ్చా?

ప్రస్తుతం రష్యా, బెలారస్ దేశాల అథ్లెట్లు తమ దేశాల జెండాలతో పాల్గొనడంపై ఒలింపిక్ సంఘం నిషేధం విధించింది. దీంతో ఆయా దేశాలకు చెందిన కొందరు అథ్లెట్లు వ్యక్తిగతంగా ఇందులో పాల్గొంటున్నారు. అయితే వారు తమ దేశం కోడ్(RUS, BEL) కాకుండా AIN(అథ్లెట్స్ ఇండివిడ్యువల్ న్యూట్రల్) పేరుతో పాల్గొంటున్నారు. ఉక్రెయిన్‌తో యుద్ధం కారణంగా రష్యా, బెలారస్‌ను అంతర్జాతీయ ఒలింపిక్ సంఘం నిషేధించింది. <<-se>>#Olympics2024<<>>
Similar News
News April 11, 2026
వ్యక్తితో పారిపోయిన బాలిక.. ఛత్తీస్‌గఢ్ హైకోర్టు కీలక తీర్పు

మైనర్ బాలిక ఓ వ్యక్తితో స్వచ్ఛందంగా వెళ్లిపోతే అతనిపై కిడ్నాప్, పోక్సో కేసులు నమోదు చేయరాదని ఛత్తీస్‌గఢ్ హైకోర్టు స్పష్టం చేసింది. 2022లో 15 ఏళ్ల బాలిక 24 ఏళ్ల వ్యక్తితో వెళ్లిపోయింది. వారిద్దరూ నెల రోజులపాటు HYD, విజయవాడలో నివాసం ఉన్నారు. తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు వారిని గుర్తించి అతనిపై పోక్సో కేసు పెట్టారు. ట్రయల్ కోర్టు నిందితునికి 20 ఏళ్ల జైలు శిక్ష విధించగా హైకోర్టు రద్దు చేసింది.
News April 11, 2026
ఫోన్ పోయిందా? ‘సంచార్ సాథీ’తో తిరిగి పొందండి!

మొబైల్ ఫోన్ పోగొట్టుకున్న వారికి ‘సంచార్ సాథీ’ వరంలా మారింది. ఈ <<15182220>>యాప్<<>> ద్వారా తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక, యూపీ వంటి రాష్ట్రాల్లో లక్షకు పైగా ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు టెలికం శాఖ తెలిపింది. Sanchar Saathi యాప్‌లో పోయిన ఫోన్‌ను సులభంగా బ్లాక్, ట్రాక్ చేయవచ్చు. డిజిటల్ భద్రతను పెంచేందుకు, అపరిచిత సిమ్ కార్డులను గుర్తించేందుకు ప్రతి ఒక్కరూ ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలని ప్రభుత్వం సూచించింది.
News April 11, 2026
చిన్నారులకు విటమిన్ డి ఎందుకు అవసరం?

పిల్లల ఎముకలు,కండరాల ఆరోగ్యం విషయంలో విటమిన్ D పాత్ర చాలా ముఖ్యమైనది. రోగనిరోధక వ్యవస్థ పనితీరుతో పాటు మొత్తం శరీర ఆరోగ్యంలో D విటమిన్ కీలకపాత్ర పోషిస్తుంది. విటమిన్ D లోపం కారణంగా అనేక రకాల సమస్యలు తలెత్తుతాయి. కీళ్ల నొప్పులు, నిరంతరం అలసట, జుట్టు పల్చబడటం, గాయాలు నెమ్మదిగా మానడం మొదలైనవి విటమిన్ D లోపానికి సంకేతాలు. ఈ లక్షణాలు పిల్లల ఆరోగ్యంపై తీవ్రంగా ప్రభావం చూపిస్తాయి.


