News July 31, 2024
భారత్-శ్రీలంక మ్యాచ్ టై
శ్రీలంక- భారత్ మధ్య జరిగిన మూడో టీ20 మ్యాచ్ టై అయ్యింది. నిర్ణీత ఓవర్లలో ఇరు జట్లూ 137 పరుగులే చేశాయి. స్వల్ప లక్ష్యంతో బరిలో దిగిన శ్రీలంక ఒకానొక దశలో గెలిచేలా కనిపించింది. 15.2 ఓవర్లలో 110/2 స్కోరుతో బలంగా ఉన్న ఆ జట్టు.. ఆ తర్వాత 12 పరుగుల తేడాతో 6 వికెట్లు కోల్పోయింది. గెలుపు కోసం చివరి ఓవర్‌లో 6 పరుగులు చేయాల్సి ఉండగా, ఆశ్చర్యకరంగా సూర్య బౌలింగ్ వేశారు. 5 పరుగులే ఇచ్చి 2 వికెట్లు పడగొట్టారు.
Similar News
News February 1, 2025
5న క్యాబినెట్, అసెంబ్లీ సమావేశాలు
TG: ఈ నెల 5న క్యాబినెట్ సమావేశం నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. కులగణన, ఎస్సీ వర్గీకరణ నివేదికలపై ఈ సమావేశంలో చర్చించనుంది. క్యాబినెట్ భేటీ తర్వాత అసెంబ్లీ సమావేశం నిర్వహించి వీటిని సభలో ప్రవేశపెట్టనుంది. అలాగే పంచాయతీ ఎన్నికలపైనా సీఎం రేవంత్ అధ్యక్షతన జరిగే భేటీలో సమాలోచనలు చేసే అవకాశం ఉంది. అటు రేపు ప్రభుత్వం ఏర్పాటు చేసిన క్యాబినెట్ సబ్ కమిటీకి కులగణన నివేదిక అందనుంది.
News February 1, 2025
రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా RP ఠాకూర్
AP: రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా మాజీ డీజీపీ RP ఠాకూర్‌ను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఢిల్లీ ఏపీ భవన్ వేదికగా ఈయన పని చేయనున్నారు. RP ఠాకూర్ 2018 నుంచి 2019 వరకు ఏపీ డీజీపీగా పనిచేశారు. కొంత కాలం ఆర్టీసీ ఎండీగా కూడా సేవలందించారు.
News February 1, 2025
రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా ABV
AP: రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా విశ్రాంత IPS అధికారి ఏబీ వెంకటేశ్వరరావును(ABV)ను ప్రభుత్వం నియమించింది. రెండేళ్ల పాటు ఆయన ఈ పదవిలో కొనసాగుతారని ఉత్తర్వుల్లో పేర్కొంది. వైసీపీ హయాంలో ABV రెండు సార్లు సస్పెండ్ కాగా, ఆ కాలాన్ని ప్రభుత్వం ఇటీవలే క్రమబద్ధీకరించింది. సస్పెన్షన్‌కు గురికాకపోతే వచ్చే అలవెన్సులు, వేతనం చెల్లించాలని ఆదేశించిన విషయం తెలిసిందే.