News July 31, 2024
మహిళల బలోపేతం కోసమే మహిళా శక్తి : కలెక్టర్

ఖమ్మం: మహిళలను ఆర్ధికంగా బలోపేతం చేయడమే మహిళా శక్తి పధకం ముఖ్య ఉద్దేశ్యమని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ తెలిపారు. మంగళవారం నగరంలోని టేకులపల్లి మహిళా ప్రాంగణంలో మహిళా సమాఖ్యలకు నిర్వహించిన అవగాహన సదస్సులో కలెక్టర్ పాల్గొని మాట్లాడారు. సంఘసభ్యులు, మహిళలకు జీవనోపాధి కల్పించాలని, వారిని ఆర్థికంగా బలోపేతం చేయాలని పేర్కొన్నారు.
Similar News
News September 19, 2025
ఖమ్మం: సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌ను ప్రారంభించిన కలెక్టర్

రాపర్తి నగర్‌లోని TGMRJC బాలికల జూనియర్ కళాశాలలో నిట్, ఐఐటీ ఆశావహ విద్యార్థినుల కోసం ఏర్పాటు చేసిన సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌ను జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ప్రారంభించారు. లైబ్రరీ, తరగతి గదులను పరిశీలించిన కలెక్టర్, విద్యార్థినులు, తల్లిదండ్రులతో ఆత్మీయంగా మాట్లాడి తన అనుభవాలను పంచుకున్నారు. ఇంటర్లో కృషి చేస్తే మంచి కెరీర్ సాధ్యమని, పోటీ పరీక్షల్లో ఉపాధి అవకాశాలు లభిస్తాయని తెలిపారు.
News September 18, 2025
ఖమ్మం: ‘పదవి ముగిసిన.. బాధ్యతలకు ముగింపు లేదు’

సర్పంచ్ పదవి కాలం ముగిసి 20 నెలలు కావొస్తున్న.. రఘునాథపాలెం మండలంలోని బూడిదంపాడు గ్రామ మాజీ సర్పంచ్ షేక్ మీరా సాహెబ్ మాత్రం తన వంతు బాధ్యతలు నిర్వర్తిస్తూనే ఉన్నారు. అనునిత్యం ప్రజల మధ్యలోనే ఉంటూ అనేక పనులు చేయిస్తూ తన వంతు కృషి చేస్తున్నారు. వీధులను శుభ్రం చేయించడం, బ్లీచింగ్ చల్లించడం, పరిసర ప్రాంతాల్లో పిచ్చి మొక్కల నివారణకు కలుపు మందు పిచికారి చేయించడం వంటి ఎన్నో పనులు చేపిస్తూ ఉన్నారు.
News September 18, 2025
ఖమ్మం పార్కు, ఖిల్లా రోప్‌వే అభివృద్ధికి ₹18 కోట్లు

ఖమ్మంలోని వెలుగుమట్ల అర్బన్ పార్కు, ఖిల్లా రోప్‌వే అభివృద్ధికి ప్రభుత్వం ₹18 కోట్లు మంజూరు చేసింది. పురపాలక శాఖ కార్యదర్శి శ్రీదేవి ఈ మేరకు జీఓ నెం.51ని విడుదల చేశారు. వెలుగుమట్ల పార్కు అభివృద్ధి, నిర్వహణకు ₹3 కోట్లు, ఖిల్లా రోప్‌వే, ఇతర అభివృద్ధి కార్యక్రమాల కోసం ₹15 కోట్లు కేటాయించారు. ఈ నిధులతో జిల్లాలో పర్యాటకం మరింతగా అభివృద్ధి చెందే అవకాశం ఉంది.