News July 31, 2024
కొండచరియలు విరగడంతో జరిగిన విషాదాలు

✒ 1948లో అస్సాంలోని గువాహటిలో 500 మందికిపైగా దుర్మరణం.
✒ 1968లో బెంగాల్‌లోని డార్జిలింగ్‌లో 1,000 మందికి పైగా చనిపోయారు.
✒ 1998లో UPలో మాప్లాలో 380 మంది మృతి.
✒ 2013లో ఉత్తరాఖండ్‌లోని కేదార్‌నాథ్‌లో 4,200 గ్రామాలు కొట్టుకుపోయాయి. 5,700 మంది దుర్మరణం.
✒ 2014లో మహారాష్ట్రలోని మాలిన్‌లో 151 మంది మృతి.
✒ 2024లో కేరళలోని వయనాడ్‌లో 123 మంది మరణం.
Similar News
News March 13, 2026
మెడికల్ ఆఫీసర్ల పోస్టులకు UPSC నోటిఫికేషన్

కంబైన్డ్ మెడికల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ కింద వివిధ ప్రభుత్వ విభాగాల్లోని మెడికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి UPSC నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 1,358 పోస్టులు కాగా ఇందులో సెంట్రల్ హెల్త్ సర్వీసెస్‌లో 864 పోస్టులు ఉన్నాయి. వీటితో పాటు రైల్వే, ఢిల్లీ మున్సిపల్ కౌన్సిల్, ఢిల్లీ కార్పొరేషన్‌లో 494 ఖాళీలు ఉన్నాయి. UPSC <
News March 13, 2026
ప్రెగ్నెన్సీలో కాస్మెటిక్స్ వాడితే ఏమవుతుందంటే?

ప్రెగ్నెన్సీ సమయంలో గాఢ రసాయనాలుండే పెర్‌ఫ్యూమ్‌లు, రూమ్ ఫ్రెషనర్లు, కాస్మెటిక్స్ వాడటం వల్ల ఎండోక్రైన్ సిస్టంపై ప్రభావం పడుతుందంటున్నారు నిపుణులు. వీటివల్ల బిడ్డ పుట్టుకలో లోపాలు, ట్యూమర్లు, అండంలో పెరుగుదల లోపాలు వంటివి జరగవచ్చంటున్నారు. కొన్నిసార్లు అబార్షన్ కూడా అయ్యే అవకాశం ఉంటుందని హెచ్చరిస్తున్నారు. కాబట్టి ఏవైనా వాడేముందు అందులో ఇంగ్రీడియంట్స్ గురించి తెలుసుకోవాలని సూచిస్తున్నారు.
News March 13, 2026
జంతువుల కొవ్వు కలిసిందనడానికి మీరేమైనా నిపుణులా: సుప్రీంకోర్టు

AP: తిరుమల లడ్డూ వ్యవహారంపై మానూరు శ్రీనివాస్ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టేసింది. నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసిందని రాజ్యాంగ పదవుల్లో ఉన్నవారు వ్యాఖ్యానిస్తున్నారని, ఈ దిశగా CBI దర్యాప్తు చేయలేదని పిటిషనర్ పేర్కొన్నారు. దీంతో జంతువుల కొవ్వు కలిసిందనడానికి మీరేమైనా నిపుణులా? అని CJI జస్టిస్ సూర్యకాంత్ ప్రశ్నించారు. ఏవైనా ఆధారాలుంటే CBIకి ఇవ్వాలని సూచిస్తూ కేసు విచారణను ముగించారు.


