News July 31, 2024

న్యాయం చేయండి.. పవన్‌కు సుగాలి ప్రీతి తల్లి వినతి

image

AP: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను సుగాలి ప్రీతి తల్లి పార్వతి కలిశారు. తమ బిడ్డకు జరిగిన అన్యాయం మరే ఆడ బిడ్డకు జరగకుండా చూడాలని, తమకు న్యాయం చేయాలని కోరారు. ఈ కేసును సీబీఐకి అప్పగిస్తూ గత ప్రభుత్వం జీవో ఇచ్చిందని, అయితే దర్యాప్తు ప్రారంభం కాలేదని చెప్పారు. ఈ విషయంపై పోలీసులతో మాట్లాడతానని పవన్ హామీ ఇచ్చారు. 2017లో సుగాలి ప్రీతిపై హత్యాచారం జరిగిందనే ఆరోపణలున్నాయి.

Similar News

News April 2, 2026

భద్రాద్రి: డ్రైనేజీలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం

image

లక్ష్మీదేవి పల్లి మండలం మెడికల్ కాలేజీ సమీపంలో ఉన్న మురుగు కాలువలో గురువారం గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమవడం కలకలం రేపింది. కాలువలో మృతదేహాన్ని గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి, వివరాల కోసం ఆరా తీస్తున్నారు. మృతికి గల కారణాలపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

News April 2, 2026

మీ రుణం తీర్చుకోలేం: అమరావతి మహిళలు

image

AP: అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లును పార్లమెంటు ఆమోదించడంతో ఏపీలో సంబరాలు అంబరాన్నంటాయి. ఉద్ధండరాయునిపాలెం సభలో CBN, ఆయన సతీమణి భువనేశ్వరి పాల్గొన్నారు. CBN ప్రసంగం సహా సభ అంతా ఉద్వేగభరితంగా సాగింది. ముఖ్యంగా సుదీర్ఘ పోరాటం చేసిన మహిళలు సభ అనంతరం CM దంపతులకు భావోద్వేగంతో ధన్యవాదాలు తెలిపారు. ‘ఈ జన్మకు ఇది చాలు సార్. మా బతుకులు నిలబెట్టారు. ఎన్ని జన్మలెత్తినా రుణం తీర్చుకోలేం’ అని అన్నారు.

News April 2, 2026

రెండో విడత ఇందిరమ్మ ఇళ్లు.. మంత్రి కీలక ప్రకటన

image

TG: ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకం రెండో విడతపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గుడ్ న్యూస్ చెప్పారు. ఈ నెలాఖరులో రెండో విడత లబ్ధిదారుల ఎంపికను ప్రారంభిస్తామని చెప్పారు. ఇది నిరంతర ప్రక్రియ అని పేర్కొన్నారు. కాగా ఇప్పటికే మొదటి విడతలో నియోజకవర్గానికి 3,500 ఇళ్ల చొప్పున కేటాయించారు. అటు రంగారెడ్డి జిల్లా ఆమనగల్‌లో భూభారతి పోర్టల్‌ను మంత్రి ప్రారంభించారు.