News July 31, 2024
భూముల రీసర్వేపై చంద్రబాబు యూటర్న్: అంబటి

AP: ఎన్నికల ప్రచారంలో భూముల రీసర్వేను తప్పుపట్టిన చంద్రబాబు ఇప్పుడు యూటర్న్ తీసుకున్నారని మాజీ మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. రీసర్వేను రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన కొద్ది రోజుల్లోనే మాట మార్చారని దుయ్యబట్టారు. చంద్రబాబు అబద్ధంలోనే పుట్టారని, అందులోనే రాజకీయం చేస్తున్నారని విమర్శించారు. సూపర్ సిక్స్‌ను అమలు చేయలేక శ్వేతపత్రాలతో కాలయాపన చేస్తున్నారని ఆరోపించారు.
Similar News
News January 9, 2026
NGKL: సింగోటం జాతర ఏర్పాట్లపై మంత్రి జూపల్లి సమీక్ష

కొల్లాపూర్‌లోని సింగోటం జాతరకు వివిధ రాష్ట్రాల నుంచి వచ్చే భక్తులకు అసౌకర్యం లేకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదేశించారు. కలెక్టర్ సంతోష్‌తో కలిసి లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకున్న మంత్రికి పండితులు ఆశీర్వచనాలందించారు. జాతరలో ప్రత్యేక ఆకర్షణగా టూరిజంశాఖతో ఐమాక్స్ లైటింగ్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. భక్తులకు తాగునీరు, పారిశుద్ధ్య పనులపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు.
News January 9, 2026
97% మందికి వైకుంఠ ద్వార దర్శనం: CM CBN

AP: తిరుమల పవిత్రతను కాపాడేేందుకు భక్తుల సహకారం అవసరమని CM CBN అన్నారు. వైకుంఠ ఏకాదశిని అద్భుతంగా నిర్వహించిన TTDని అభినందించారు. DEC 30-JAN 8 వరకు 7.83 లక్షల మందికి వేంకటేశ్వరుడి దర్శన భాగ్యం కల్పించడంపై హర్షం వ్యక్తం చేశారు. 97% మంది సామాన్యులకు వైకుంఠ ద్వార దర్శనం కల్పించడం అభినందనీయమన్నారు. క్యూలైన్లు, ప్రసాదం పంపిణీ నుంచి అమలు చేసిన అన్ని విధానాలు సత్ఫలితాలనిచ్చాయన్నారు.
News January 9, 2026
అద్దె బస్సులు.. సమ్మె రద్దు

AP: ఆర్టీసీ అద్దె బస్సుల యజమానులు <<18795223>>సమ్మె<<>> రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ నెల 12 నుంచి సమ్మె తలపెట్టగా ప్రభుత్వ జోక్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంఘాల నాయకులు వెల్లడించారు. 5 ప్రధాన సమస్యలను ఆర్టీసీ ఎండీకి వివరించినట్లు పేర్కొన్నారు. దీంతో సంక్రాంతి వేళ ప్రయాణికులకు ప్రయాణకష్టాలు తప్పినట్లే.


