News July 31, 2024

సీఎం చంద్రబాబుతో నోబెల్ గ్రహీత భేటీ

image

AP: అమెరికాకు చెందిన ఆర్థిక వేత్త, నోబెల్ గ్రహీత మైఖేల్ క్రేమర్ సీఎం చంద్రబాబుతో భేటీ అయ్యారు. విద్య, వైద్యం, వ్యవసాయం, నీటి పారుదల రంగాలపై చర్చించారు. గ్రామీణ ప్రాంతాలకు తాగు నీటి సరఫరాపై మైఖేల్ అనుభవాన్ని వినియోగించుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఎవిడెన్స్ యాక్షన్ అనే సంస్థతో కలిసి 500 గ్రామాల్లో పైలట్ ప్రాజెక్టు అమలు చేయనుంది.

Similar News

News February 12, 2026

‘టీ’ని మళ్లీ వేడి చేస్తున్నారా.. ఇది మీ కోసమే!

image

చల్లారిన టీని మళ్లీ వేడి చేయడం ఆరోగ్యానికి హానికరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ‘రీహీట్ వల్ల చాయ్ చేదుగా, అసిడిటిక్‌గా మారుతుంది. కడుపులో తిప్పడం, అసిడిటీ, హార్ట్‌బర్న్, ఛాతీలో మంట ఏర్పడొచ్చు. అందులో చేరుకున్న బాక్టీరియా వల్ల కడుపు నొప్పి, వాంతులు, ఫుడ్ పాయిజన్ కావొచ్చు. తాజా టీతో పోలిస్తే యాంటీఆక్సిడెంట్లు తగ్గుతాయి. అందుకే ఫ్రెష్‌గా తాగండి. వాడిన పొడిని మళ్లీ వాడొద్దు’ అని చెబుతున్నారు.

News February 12, 2026

US హౌస్‌లో ట్రంప్‌కు షాక్.. కెనడాకు మద్దతుగా ఓటింగ్

image

US హౌస్ సభ్యులు ట్రంప్‌కు షాకిచ్చారు. <<18949938>>కెనడా<<>>పై విధించిన టారిఫ్స్‌ను తిరస్కరిస్తూ ఓటు వేశారు. డెమొక్రాట్లు తీసుకొచ్చిన తీర్మానం 219-211 తేడాతో నెగ్గింది. ఆరుగురు రిపబ్లికన్లు(ట్రంప్ పార్టీ) కూడా అనుకూలంగా ఓటేయడం గమనార్హం. అయితే దీనికి సెనేట్, ట్రంప్ ఆమోదం తప్పనిసరి. కానీ ట్రంప్ వీటో చేసే అవకాశం ఉంది. సుంకాలను వ్యతిరేకించే రిపబ్లికన్లపై ఎన్నికల సమయంలో చర్యలు తీసుకుంటామని ట్రంప్ హెచ్చరించారు.

News February 12, 2026

శివ నామాలు అర్థాలు ‘‘గంగాధర’’

image

భగీరథుడు తన పితృదేవతల మోక్షం కోసం గంగను భూమికి తీసుకురావాలని తపస్సు చేశాడు. గంగ ఆకాశం నుంచి నేరుగా భూమి మీద పడితే ఆ వేగానికి భూలోకం తట్టుకోలేదని శివుడు గ్రహించాడు. గంగమ్మను తన జటాజూటంలో బంధించాడు. తన జుట్టు నుంచి ఓ పాయను బయటకి తీసి, దాని ద్వారా గంగను భూమిపైకి నెమ్మదిగా వదిలాడు. అల్లకల్లోలమైన గంగను శాంతింపజేసి తన తలపై ధరించిన వాడు కాబట్టే ఆయన ‘గంగాధరుడు’ అయ్యాడు. ఇది ఆయన లోకహితైషితకు నిదర్శనం.