News July 31, 2024
హోంమంత్రి పదవి ఇస్తే కాంగ్రెస్‌లో చేరతా: మల్లారెడ్డి

TG: బీఆర్ఎస్ మూడోసారి గెలిచిఉంటే తాను హోంమంత్రి అయ్యేవాడినని మల్లారెడ్డి చెప్పారు. సంవత్సరానికి నాలుగు సినిమాలు తీసేవాడినని, కొత్త శాటిలైట్ ఛానల్ పెట్టేవాడినని తెలిపారు. అసెంబ్లీ లాబీలో మీడియాతో చిట్‌చాట్‌లో మాట్లాడుతూ.. తనకు ఇప్పుడు హోంమంత్రి పదవి ఇస్తే కాంగ్రెస్‌లో చేరడానికి సిద్ధంగా ఉన్నానన్నారు. ఇందుకు సీఎం రేవంత్ అంగీకరించరని, జర్నలిస్టులు మధ్యవర్తిత్వం చేయాలని కోరారు.
Similar News
News March 12, 2026
దేశం సంక్షోభంలో.. మోదీ టూర్‌లో: ఖర్గే

దేశం తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిందని మల్లికార్జున ఖర్గే అన్నారు. ఈ తరుణంలో PM మోదీ ఎన్నికల టూర్ చేపడుతున్నారని విమర్శించారు. ‘దేశవ్యాప్తంగా LPG కొరత ఉంది. ప్రజలు క్యూలైన్లలో నిలబడుతున్నారు. అనేక వ్యాపారాలు దెబ్బతిన్నాయి. ప్రభుత్వం దగ్గర మాత్రం సమాధానం లేదు. దౌత్యపరంగా విఫలమవడం చాలా తీవ్రమైన అంశం. ఎనర్జీ మిస్‌మేనేజ్‌మెంట్ ఫలితాన్ని 140 కోట్ల మంది అనుభవిస్తున్నారు’ అని ఖర్గే పోస్ట్ చేశారు.
News March 12, 2026
ఇంటర్ పూర్తయిందా?.. ఓ లుక్కేయండి!

<<19343753>>ఇంటర్<<>> పూర్తయినవారు రెగ్యులర్ కోర్సులకే పరిమితం కాకుండా క్రియేటివిటీతో కూడిన డేటా అనలిటిక్స్, డిజిటల్ మార్కెటింగ్ అద్భుతమైన అవకాశాలు ఉన్నాయి. క్రియేటివిటీ ఉన్నవారు డిజైన్ (NID/NIFT) కోర్సుల ద్వారా రాణించవచ్చు. పర్యాటక రంగం విస్తరిస్తుండటంతో హోటల్ మేనేజ్‌మెంట్‌లో కూడా ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అవ్వాలనుకుంటే AI, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీకి మంచి డిమాండ్ ఉంది.
News March 12, 2026
కొత్త ఏడాది ఏ రాశి వారికి ఎలా ఉందంటే?

ఈనెల 19న చైత్ర శుద్ధ పాడ్యమి రోజున తెలుగు నూతన సంవత్సరం ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా ‘శ్రీ పరాభవ నామ’ సంవత్సరంలో అన్ని రాశుల ఆదాయ వ్యయాలు, రాజపూజ్య, అవమానాల పంచాగాన్ని ‘భక్తి’ టీవీ విడుదల చేసింది. ముఖ్యంగా మిథున రాశివారికి ఆదాయం కంటే వ్యయం & రాజ్య పూజ్యం కంటే అవమానాలే ఎక్కువగా ఉంటాయని పండితులు తెలిపారు. సింహ రాశి వారికి అన్నీ సరిసమానంగా ఉంటాయని చెప్పారు. మీ రాశి ఏంటో కామెంట్ చేసి షేర్ చేయండి.


