News July 31, 2024
మీ అకౌంట్లో డబ్బులు పడ్డాయా?

TG: రూ.లక్ష నుంచి రూ.లక్షన్నర వరకు రుణాలున్న రైతుల ఖాతాల్లో రుణమాఫీ డబ్బులు జమ అవుతున్నాయి. రెండో విడత రుణమాఫీ కింద రాష్ట్ర ప్రభుత్వం నిన్న 6,40,823 మంది రైతుల ఖాతాల్లో రూ.6190.01 కోట్లను జమ చేసింది. అత్యధికంగా నల్గొండ జిల్లాలో 51,515 మందికి రుణమాఫీ కాగా.. అత్యల్పంగా HYD జిల్లాలో ఏడుగురికి మాఫీ జరిగింది. మరి డబ్బులు డిపాజిట్ అయినట్లు మీకు మెసేజ్ వచ్చిందా? కామెంట్ చేయండి.
Similar News
News January 31, 2026
ఇంటి మీద గుడి నీడ పడకూడదా?

గుడి నీడ పడే చోట ఇంటి నిర్మాణం చేయకూడదని వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు సూచిస్తున్నారు. ‘ఇంటిపై గుడి నీడ పడటం శాస్త్ర సమ్మతం కాదు. దేవాలయ ఆగమశాస్త్రం ప్రకారం దాన్ని మంత్రశక్తితో ప్రతిష్ఠిస్తారు. నిత్య హోమాలు, జపాలతో అక్కడ దైవశక్తి కేంద్రీకృతమై ఉంటుంది. నివాస గృహాల్లో జనన మరణాలు, మైల వంటివి సహజం. ఆ అశౌచం వల్ల గుడి పవిత్రతకు ఆటంకం కలుగుతుంది. ఆ పాపం తగలకూడదు. అందుకే దూరంగా ఉండాలి’ అంటున్నారు. <<-se>>#Vasthu<<>>
News January 31, 2026
కాసేపట్లో అంబటి రాంబాబు అరెస్టు?

AP: సీఎం చంద్రబాబుపై <<19013972>>అనుచిత వ్యాఖ్యల<<>> కేసులో మాజీ మంత్రి అంబటి రాంబాబును అరెస్టు చేసేందుకు పోలీసులు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఆయన ఇంటి వద్ద నుంచి టీడీపీ కార్యకర్తలను పంపిస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు పోలీసులను భారీగా మోహరించారు. ప్రత్యేక వాహనాన్ని అక్కడికి తీసుకొచ్చారు.
News January 31, 2026
సెంచరీతో చెలరేగిన ఇ’షాన్’

NZతో జరుగుతున్న చివరి టీ20లో భారత బ్యాటర్ ఇషాన్ కిషన్ అదరగొట్టారు. కేవలం 42 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసుకున్నారు. 10 సిక్సర్లు, 6 ఫోర్లతో కివీస్ బౌలర్లను ఓ ఆట ఆడుకున్నారు. మరోవైపు సూర్య 30 బంతుల్లో 63 పరుగులు చేసి ఔటయ్యారు. ఈ ఇన్నింగ్సుతో ఇషాన్ అంతర్జాతీయ టీ20ల్లో 1,000 రన్స్ పూర్తి చేసుకున్నారు.


