News July 31, 2024
దొనకొండలో విమానాలు ఎగరడానికి ముహూర్తం ఖరారైందా?

దొనకొండ విమానాశ్రయానికి ఉన్న చరిత్ర అంతా ఇంతా కాదు. 1934లో తెల్లదొరలు ఈ విమానాశ్రయం నిర్మించారు. స్వాతంత్ర్యం తర్వాత 1965 వరకు ఇక్కడ సైనిక విమానాలు రయ్.. రయ్ అంటూ చక్కర్లు కొట్టేవి. ఇక ఆ సమయం నుంచి ఇక్కడ ఒక్కసారిగా విమానాల రాకపోకలు బందయ్యాయి. తాజాగా కూటమి ప్రభుత్వం దొనకొండ విమానాశ్రయానికి పూర్వ వైభవం తెచ్చేందుకు చర్యలు తీసుకుంటోంది. దీంతో ప్రకాశం జిల్లాకు మహర్దశ పట్టిందని ప్రజలు అంటున్నారు.
Similar News
News March 3, 2026
వెలుగొండ నిర్వాసితులకు న్యాయం ఏది..?

వెలుగొండ ప్రాజెక్టు కింద ముంపుకు గురైన గ్రామాల నిర్వాసితులకు తీవ్ర అన్యాయం జరుగుతోందని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రాజెక్టు పరిధిలో 11 గ్రామాలు ముంపుకు గురికానుండగా.. పెద్దారవీడు మండలంలోని సుంకేసుల, కలనూతల, గుండంచెర్ల గ్రామాల పరిస్థితి దయనీయంగా ఉందని స్థానికులు ఆవేదన చెందుతున్నారు. ఈ వ్యవహారంపై పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేదన్నారు.
News March 3, 2026
ప్రకాశం SP కార్యాలయానికి 80 అర్జీలు

ప్రకాశం జిల్లా SP కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించారు. SP హర్షవర్ధన్ రాజు ప్రజల నుంచి వచ్చిన 80 వినతి పత్రాలను స్వీకరించారు. సంబంధిత PS అధికారులతో మాట్లాడి చట్టబద్ధంగా సమస్యలను పరిష్కరించాలని సూచించారు. ఫిర్యాదుదారులతో మాట్లాడుతూ.. వారి సమస్యలు పరిశీలించి న్యాయం చేస్తానని భరోసా కల్పించారు. అధికంగా భూ, ఆర్థిక తగాదాలు, అత్తింటి వేధింపులు, ఉద్యోగ మోసాలు వంటివి వచ్చాయన్నారు.
News March 2, 2026
10th పరీక్షలు పగడ్బందీగా నిర్వహించాలి: ప్రకాశం JC

ప్రకాశం జిల్లాలో ఈనె ల 16వ తేదీ నుంచి 10th పబ్లిక్ పరీక్షలు జరగనున్న విషయం తెలిసిందే. అయితే ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా పటిష్టంగా పరీక్షలకు ఏర్పాట్లు చేయాలని జాయింట్ కలెక్టర్ కల్పనా కుమారి సోమవారం అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ముఖ్యంగా పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేసి, విద్యార్థులకు తాగునీరు, రవాణా సౌకర్యాలు కల్పించాలన్నారు.


