News July 31, 2024
గనుల శాఖపై నేడు చంద్రబాబు సమీక్ష

AP: గనుల శాఖపై సీఎం చంద్రబాబు నేడు సమీక్ష నిర్వహించనున్నారు. YCP నేతలు ఇసుక ద్వారా రూ.వేల కోట్లు దోచుకున్నారని, క్వార్ట్జ్, సిలికాశాండ్ వంటివాటిల్లోనూ భారీగా దండుకున్నారని NDA కూటమి ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. వీటిపై CM ఇప్పటికే శ్వేతపత్రాన్ని విడుదల చేశారు. గత ప్రభుత్వ హయాంలో రూ.19,137కోట్ల మేర దోపిడీ జరిగిందని ఆయన పేర్కొన్నారు. నేటి సమీక్షలో సీఎం ఆ అంశంపై ప్రధానంగా దృష్టి పెట్టనున్నట్లు టాక్.
Similar News
News August 31, 2025
SEP నుంచి ఏమేం మారుతాయంటే!

*SEP 3, 4 తేదీల్లో జరగనున్న 56వ GST సమావేశంలో 4 శ్లాబులకు బదులు.. 5%, 18% శ్లాబులను మాత్రమే ఖరారు చేసే అవకాశం.
*రేపటి నుంచి వెండి ఆభరణాలకు హాల్ మార్క్ విధానం అమలు కావొచ్చు.
*కొన్ని SBI క్రెడిట్ కార్డ్స్‌కు డిజిటల్ గేమింగ్, Govt పోర్టల్స్‌లో పేమెంట్స్ రివార్డు పాయింట్స్ ఉండవు.
*SEP 30లోపు జన్‌ధన్ ఖాతాలకు KYC పూర్తి చేయాలి.
*2025-26 అసెస్మెంట్ ఇయర్ ITR ఫైలింగ్‌కు SEP 15 చివరి తేదీగా ఉంది.
News August 31, 2025
మేడిగడ్డ కూలింది ఇందుకే..: మంత్రి పొంగులేటి

TG: డయాఫ్రమ్ వాల్‌ను కాంక్రీట్‌తో కాకుండా సీకెంట్ పైల్ వాల్ టెక్నాలజీతో కట్టడం వల్లే మేడిగడ్డ బ్యారేజీ కూలిందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అసెంబ్లీలో ఆరోపించారు. ‘మేడిగడ్డలో కేసీఆర్ ఫాంహౌస్‌లోని బావి సైజులో రంధ్రం పడింది. మామ KCR చెప్పారు.. అల్లుడు హరీశ్ పాటించారు. ఒకే టెక్నాలజీతో మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు కట్టారు. ఆ మూడూ ఇప్పుడు ప్రమాదంలో పడ్డాయి’ అని ఆయన వ్యాఖ్యానించారు.
News August 31, 2025
మా కుటుంబం ఎప్పుడూ బీఫ్ తినలేదు: సల్మాన్ ఖాన్ తండ్రి

తమ కుటుంబం ఇప్పటివరకు బీఫ్ తినలేదని బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ తండ్రి సలీం ఖాన్ తెలిపారు. తాము ముస్లింలైనప్పటికీ తమ ఇంట్లో దానిని నిషేధించామని చెప్పారు. ‘ఆవు పాలు తల్లి పాలతో సమానం. అందుకే మేం బీఫ్‌కు దూరం. ఫుడ్ విషయంలో ఎవరేం తిన్నా అది వారిష్టం. మా ఫ్యామిలీ అన్ని మతాలను గౌరవిస్తుంది. ఇంట్లో అన్ని పండుగలు జరుపుకుంటాం. ఈ ఏడాది కూడా గణపతిని ప్రతిష్ఠించి పూజలు చేశాం’ అని ఆయన పేర్కొన్నారు.