News July 31, 2024
నేటి నుంచి ఓపెన్ స్కూల్ అడ్మిషన్లు ప్రారంభం

AP: పదో తరగతి, ఇంటర్మీడియట్ ఓపెన్ స్కూల్ ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైంది. నేటి నుంచి ఆగస్టు 27 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు డైరెక్టర్ నాగేశ్వరరావు తెలిపారు. రూ.200 ఫైన్‌తో ఆగస్టు 28 నుంచి సెప్టెంబర్ 4 వరకు అప్లై చేసుకునేందుకు అవకాశం ఉందని చెప్పారు. <
Similar News
News March 21, 2026
ప్లే విత్ ఫైర్.. ప్లే విత్ పేషన్స్

మరో వారంలో IPL-19 ప్రారంభం కానుంది. తొలి మ్యాచులో RCBని SRH ఢీకొట్టనుంది. ఈసారి సన్‌రైజర్స్ ‘PlayWithFire’ నినాదంతో బరిలోకి దిగుతోంది. ఫైర్ అవసరమే అయినా ఆ జట్టుకు ఓపిక(Patience) కూడా ఉండాలని కొందరు అభిమానులు అభిప్రాయపడుతున్నారు. ఓపెనర్లు ఫైర్ చూపించాలని, మిడిల్ ఆర్డర్ పేషన్స్‌తో ఆడాలని కోరుతున్నారు. తద్వారా ప్రత్యర్థిపై పైచేయి సాధించి, భారీ స్కోర్‌కు అవకాశం ఉంటుందని చెబుతున్నారు. మీరేమంటారు?
News March 21, 2026
అమెరికాకు ‘క్విడ్ ప్రోకో’ ప్రతిపాదన చేయలేదు: రష్యా

ఉక్రెయిన్‌కు మద్దతును అమెరికా ఉపసంహరించుకుంటే తాము ఇరాన్‌కు ఇంటెలిజెన్స్ సాయాన్ని నిలిపివేస్తామని రష్యా ఆఫర్ ఇచ్చినట్లు అంతర్జాతీయ మీడియాలో వార్తలొచ్చాయి. వీటిని రష్యా ఖండించింది. అమెరికాతో ఎలాంటి క్విడ్ ప్రోకో ప్రతిపాదన జరగలేదని, ఇవన్నీ ఫేక్ వార్తలని స్పష్టం చేసింది. పుతిన్ రాయబారి కిరిల్ దిమిత్రీవ్ ఈ ఐడియాను ప్రతిపాదించినట్లు నివేదికలు పేర్కొనగా, ఆయన దీనిని X వేదికగా ఖండించారు.
News March 21, 2026
ఆడియన్స్ సీట్లకు అతుక్కుపోయారు: రాజమౌళి

‘ధురంధర్-2’ 4 గంటల నిడివి ఉన్నా ఆడియన్స్ లాస్ట్ ఫ్రేమ్ వరకు సీట్లకు అతుక్కుపోయారని డైరెక్టర్ రాజమౌళి అన్నారు. ఇంతటి లెన్త్ ఉన్న మూవీని రిలీజ్ చేయడానికి గట్స్ ఉండాలని చెప్పారు. తనకు ధురంధర్ నచ్చిందని, ధురంధర్-2 అంతకంటే బాగుందని కొనియాడారు. రైటింగ్, కాస్టింగ్, మ్యూజిక్, డైరెక్షన్ ఇలా అన్ని విభాగాల్లో మూవీ అద్భుతంగా ఉందని ట్వీట్ చేశారు. రణ్‌వీర్, మాధవన్ నటనలో మాస్టర్ క్లాస్ చూపించారన్నారు.


