News July 31, 2024

ఎరువుల వ్యాపారులకు ప్రభుత్వం వార్నింగ్

image

TG: నిబంధనలకు విరుద్ధంగా ఎరువుల క్రయవిక్రయాలు జరిపే వ్యాపారుల లైసెన్సులు రద్దు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. వారి వద్ద ఉండే పాయింట్ ఆఫ్ సేల్ మెషిన్లను వెంటనే స్వాధీనం చేసుకుని మరొకరికి అప్పగించాలని స్పష్టం చేసింది. రాష్ట్రంలో ఎరువుల నిల్వలు, సరఫరాపై నిరంతరం నిఘా ఉంచాలని పేర్కొంది. రైతులకు ఎరువులు సజావుగా పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.

Similar News

News April 4, 2026

దొంగతనం కేసులో న్యాయమూర్తి.. ముందస్తు బెయిల్ నిరాకరణ

image

నిందితులకు శిక్షలు విధించే న్యాయమూర్తే దొంగతనం కేసును ఎదుర్కొంటున్న ఘటన పంజాబ్‌లోని పటియాలాలో జరిగింది. గతేడాది అడిషనల్ డిస్ట్రిక్ట్ సెషన్స్ జడ్జి కన్వల్జిత్ సింగ్ చనిపోయారు. అదే రోజు రాత్రి ఆయన ఇంట్లో సివిల్ జడ్జి విక్రమ్‌దీప్ బంగారు ఆభరణాలను దొంగతనం చేసినట్లు కేసు నమోదైంది. ముందస్తు బెయిల్ కోరుతూ ఆయన వేసిన పిటిషన్‌ను పటియాలా కోర్టు తిరస్కరించింది. వీడియో ఆధారాలున్నందున బెయిల్ ఇవ్వలేమంది.

News April 4, 2026

భూమి లాంటి గ్రహాలు 45 ఉన్నాయట!

image

మన సౌర వ్యవస్థ వెలుపల జీవనానికి అనువైన 45 గ్రహాలు ఉన్నాయని కార్నెల్ వర్సిటీ(US) సైంటిస్టులు గుర్తించారు. నాసా వద్ద ఉన్న 6Kకు పైగా గ్రహాల సమాచారాన్ని బట్టి ఈ విషయాన్ని వెల్లడించారు. ప్రతి ప్లానెట్ నక్షత్రం నుంచి ఎనర్జీని ఎలా పొందుతుందో పరిశీలించారు. ఉపరితలంపై ద్రవ రూపంలో నీరుండటానికి ఇదొక కీలక అంశం. వీటిలో TRAPPIST-1 అనే గ్రహం 40 కాంతి సంవత్సరాల దూరంలో ఉంది.
* light-year=9.46 trillion kilometers

News April 4, 2026

ఆరెంజ్ క్యాప్‌తో హిట్‌మ్యాన్

image

IPL: ముంబై స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ ఆరెంజ్ క్యాప్ సాధించారు. ఢిల్లీపై బ్యాటింగ్ అనంతరం ఇంటర్వ్యూలో ఆ క్యాప్ ధరించారు. హిట్‌మ్యాన్ రెండు మ్యాచుల్లో కలిపి 56.50 సగటుతో 113 రన్స్ చేశారు. రోహిత్ తర్వాత కనోలి (108), రఘువంశీ (103), ఇషాన్ (94) ఉన్నారు.