News July 31, 2024

చాకిపల్లిలో మహిళ పై దాడి.. పోలీసులకు ఫిర్యాదు

image

టెక్కలి మండలం చాకిపల్లి గ్రామానికి చెందిన బొమ్మాళి జ్యోతి అనే మహిళ తనపై గ్రామానికి చెందిన కొంత మంది వ్యక్తులు దాడి చేశారని మంగళవారం టెక్కలి పోలీసులకు పిర్యాదు చేసింది. గ్రామానికి చెందిన పంగ చంద్రమౌళి, వాన నారాయణ, పొందర శ్రీనివాసరావు, యాళ్ల అప్పారావు, యాళ్ల హేమలత తనపై దాడి చేసి దుర్భాషలాడారని ఫిర్యాదులో పేర్కొంది. టీడీపీకి ఓటు వేశారని అక్కసుతోనే దాడి చేసినట్లు ఫిర్యాదులో పేర్కొంది.

Similar News

News March 8, 2026

శ్రీకాకుళం: ‘ప్రేమించి.. ఉద్యోగం వచ్చాక ముఖం చాటేశాడు’

image

పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఉద్యోగం వచ్చాక ముఖం చాటేస్తున్నాడని హిరమండలం భగీరదపేటకు చెందిన ఓ యువతి వాపోయింది. ఈ మేరకు శనివారం హిరమండలంలో అంబేడ్కర్ విగ్రహం వద్ద దళిత సంఘాలతో కలిసి మౌనదీక్ష చేపట్టింది. భామిని మండలం సింగిడి గ్రామానికి చెందిన చంద్రశేఖర్ అనే యువకుడు తనని కొన్నేళ్లుగా ప్రేమించి తీరా ఉద్యోగం వచ్చాక పెళ్లి చేసుకోమంటే చేసుకోను అంటున్నాడని తెలిపింది. పోలీసులు తనకు న్యాయం చేయాలని కోరింది.

News March 8, 2026

శ్రీకాకుళం: రోడ్డు ప్రమాదంలో ఆర్మీ జవాన్ మృతి

image

కంచిలి మండలం బొనమాలి గ్రామానికి చెందిన బీ.బాలకృష్ణ (29) అనే ఆర్మీ జవాన్ శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. తన బంధువు పెళ్లి పిలుపులు కోసం ఒరిశా ప్రాంతానికి బైక్‌పై వెళ్లి తిరిగి వస్తుండగా కొత్త శాసనం వద్దకు వచ్చే సరికి ఎదురుగా వస్తున్న మరో బైక్‌ ఢీకొనడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. ఘటనలో మరో ఇద్దరు గాయపడగా చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.

News March 8, 2026

శ్రీకాకుళం: ‘రైతులు 365 రోజులు సాగుకు ప్రాధాన్యత నివ్వాలి’

image

రైతులు 365 రోజులు సాగుకు ప్రాధాన్యత నివ్వాలని జిల్లా ప్రకృతి వ్యవసాయ ప్రాజెక్ట్ మేనజర్ పూజారి సత్యనారాయణ అన్నారు. శ్రీకాకుళం, రణస్థలం, నరసన్నపేట పరిధిలో ఉన్న ప్రకృతి వ్యవసాయ సిబ్బంది ఎఫ్ఎంటీఎస్‌కు శ్రీకాకుళంలోని నైరాలో శనివారం శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. కూరగాయలు, ఆకుకూరలు, ఉద్యాన వన పంటల సాగుతో ఏడాది పాటు రైతులకు ఆదాయం వస్తుందని చెప్పారు.