News July 31, 2024

బీబీనగర్‌: అన్నదమ్ముల మృతి

image

బీబీనగర్‌-పోచంపల్లి రహదారిలో మంగళవారం రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రమాదంలో బడుగు నరసింహ అనే వ్యక్తి మృతిచెందాడు. బాధాకరమైన విషయం ఏమిటంటే చనిపోయిన నరసింహ అన్న బడుగు స్వామి అనారోగ్యంతో మహారాష్ట్రలో చనిపోయినట్లు సమాచారం వచ్చింది. పోచంపల్లిలో ఉన్న కుటుంబ సభ్యులకు సోదరుడు చనిపోయిన విషయం చెప్పాలని బీబీనగర్‌ నుంచి బైక్‌పై బయల్దేరాడు. బీబీనగర్‌ దాటిన వెంటనే ఎదురుగా వస్తున్న స్కూల్‌ బస్సు ఢీకొని చనిపోయాడు.

Similar News

News January 12, 2026

నల్గొండ: ప్రజావాణిలో కలెక్టర్‌కు సమస్యలపై వినతి

image

నల్గొండ కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణిలో బీసీ, ఎస్సీ, ఎస్టీ జేఏసీ నాయకులు పలు సమస్యలపై వినతిపత్రం సమర్పించారు. అన్నెపర్తిలో ఓ ఇంటి వివాదం, నల్గొండలోని 20వ వార్డులో డ్రైనేజీ సమస్యలతో పాటు, మంజూరై ఆగిపోయిన ఇందిరమ్మ ఇళ్లపై కలెక్టర్‌కు వివరించారు. ఈ సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రవి, శ్రవణ్, నవీన్, సుధాకర్, అనిల్ తదితరులు పాల్గొన్నారు.

News January 12, 2026

NLG: జిల్లాలో పెరుగుతున్న రాజకీయ వేడి!

image

మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు సర్కారు అడుగులు వేస్తుండడంతో బల్దియాల్లో రాజకీయం వేడెక్కుతోంది. ఓటర్ల తుది జాబితా ప్రకటనకు ముందే రిజర్వేషన్లు ఎలా ఉంటాయి, అనుకూలించకపోతే ఏం చేయాలన్న విషయమై ఆశావహులు లెక్కలు వేసుకుంటున్నారు. NLG జిల్లాలో ప్రధానంగా NLG (ఇప్పుడు కార్పొరేషన్), MLG, CTL, DVK, HLY, CDR, నందికొండ, నకిరేకల్ వంటి మున్సిపాలిటీలు ఉన్నాయి. ఇవాళ వార్డుల వారిగా తుది ఓటర్ల జాబితాను ప్రదర్శించనున్నారు.

News January 12, 2026

NLG: కల చెదిరి.. కళ తప్పి

image

ఉమ్మడి జిల్లాలో గంగిరెద్దులను ఆడించే వారి జీవనం కష్టతరంగా మారింది. ఆదరణ కరువై, పొట్టకూటి కోసం వేరే పనులు చూసుకుంటున్నారు. ఏటా సంక్రాంతి సందర్భంగా రంగు రంగుల బట్టలు, గంటలు, మువ్వలతో ఇంటింటికీ తిరిగి అలరించే డూడూ బసవన్నల గొంతులు మూగబోతున్నాయి. ఆధునిక కాలంలో యాంత్రిక జీవనం పెరగడం, వినోద సాధనాలు మారడంతో ఈ కళ తన ప్రాభవాన్ని కోల్పోతోంది. రాను రాను అంతరించిపోయిన జాబితాలో చేరేలా కనిపిస్తోంది.