News July 31, 2024

రైతుల బిడ్డలకు పెళ్లిళ్లు కావడం లేదు: కూనంనేని

image

TG: భూమిని మాత్రమే నమ్ముకున్న రైతులు తీవ్ర నిర్లక్ష్యానికి గురవుతున్నారని CPI MLA కూనంనేని సాంబశివరావు ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల పిల్లలకు పెళ్లిళ్లు కావడం కష్టంగా ఉందని, దీనిపై అన్నదాతల వ్యథలు వర్ణనాతీతమన్నారు. తెలంగాణలోనూ ఈ పరిస్థితికి కారణమేంటో పరిశీలించాల్సిన అవసరం ఉందని ప్రభుత్వానికి ఆయన సూచించారు. అటు సాఫ్ట్‌వేర్ ఉద్యోగుల <<13739164>>సమస్యలనూ<<>> సభలో ప్రస్తావించారు.

Similar News

News January 28, 2026

ట్రంప్ వార్నింగ్.. ఇరాన్ దీటైన జవాబు

image

మిడిల్ ఈస్ట్‌లో ఉద్రిక్తత నెలకొంది. ఇరాన్ వైపు మరో యుద్ధనౌక దూసుకొస్తోందని బెదిరిస్తూనే, వారు న్యూక్లియర్ డీల్ చేసుకుంటారని భావిస్తున్నానని ట్రంప్ పోస్ట్ చేశారు. అమెరికా అధ్యక్షుడి బెదిరింపులకు ఇరాన్ బదులిచ్చింది. తమపై యూఎస్ దాడులు చేస్తే మునుపెన్నడూ లేనంతగా దీటైన జవాబిస్తామని స్పష్టం చేసింది. అమెరికా తమతో చర్చలకు వస్తే అంగీకరిస్తామని, మిలిటరీ చర్యలకు దిగాలని చూస్తే సహించబోమని హెచ్చరించింది.

News January 28, 2026

ఇందిరమ్మ ఇళ్లు.. లంచం అడిగితే ఈ నంబర్‌కు కాల్ చేయండి!

image

TG: ఇందిరమ్మ ఇళ్ల పథకంలో అవినీతికి పాల్పడితే ఉపేక్షించేది లేదని హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ గౌతమ్ స్పష్టం చేశారు. లబ్ధిదారుల నుంచి లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ హౌసింగ్ ఏఈ శ్రీకాంత్‌ను బ్లాక్ లిస్టులో పెట్టామని తెలిపారు. అధికారులు నిరాకరిస్తే ఇళ్ల ఫొటోలు లబ్ధిదారులే యాప్‌లో పెట్టవచ్చని చెప్పారు. ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్‌లో లంచం అడిగితే 1800 599 5991కు కాల్ చేయాలని సూచించారు.

News January 28, 2026

RTC ఉద్యోగులకు గుడ్ న్యూస్

image

AP: RTCలో పనిచేస్తున్న 4వేల మందికి పైగా ఉద్యోగులకు ప్రమోషన్లు రానున్నాయి. ADC/కంట్రోలర్, లీడింగ్ హెడ్స్‌లకు పదోన్నతి లభిస్తుంది. నిర్ణీత టెస్ట్ పాసైన కండక్టర్లు Jr అసిస్టెంట్లు కానున్నారు. ‘గత OCTలోనే 7500 మందికి ప్రమోషన్‌పై GO వచ్చినా 550 మందికే ఇచ్చారు. దీనిపై లేఖ ఇవ్వగా సీనియార్టీపై క్లారిటీ ఇస్తూ MD ఆదేశాలిచ్చారు. వారంలోపే మిగతా వారికీ పదోన్నతి వస్తుంది’ అని EU నేతలు దామోదర్, నరసయ్య తెలిపారు.