News July 31, 2024
కొండాపురం ఘర్షణలో 29 మందిపై కేసు

మండలంలోని టీ కోడూరు గ్రామంలో ఆధిపత్యం కోసం ఆదివారం జరిగిన ఘర్షణకు సంబంధించి 29 మందిపై కేసు నమోదు చేసి, గన్ స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై చంద్రశేఖర్ తెలిపారు. కోడూరుకు చెందిన పవన్ కుమార్ రెడ్డి, ఎంపీటీసీ రామమునిరెడ్డి మధ్య వాగ్వాదం జరిగి ఒకరిపై ఒకరు రాళ్లు వేసుకోగా ఇరువర్గాల వారికి గాయాలయ్యాయి. ఈ క్రమంలో ఎంపీటీసీ మునిరెడ్డి గాలిలో గన్‌తో ఒక రౌండ్ కాల్పులు జరిపారు.
Similar News
News March 19, 2026
వీరశివారెడ్డి బీజేపీలో చేరిక సాధ్యమేనా..?

కమలాపురం మాజీ ఎమ్మెల్యే వీరశివారెడ్డి బీజేపీలో చేరుతున్నట్లు పదేపదే ప్రకటిస్తున్నా, క్షేత్రస్థాయిలో ముహూర్తం ఖరారు కాలేదు. మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి, ఎంపీ సీఎం రమేశ్ మద్దతు తనకు ఉందని ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలోని కొందరు నేతలు ఆయన చేరికను అడ్డుకుంటున్నట్లు సమాచారం. దీంతో వీరశివారెడ్డి కమలం గూటికి చేరడం సాధ్యమవుతుందో లేదోనని రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ సాగుతోంది.

News March 18, 2026
కడప: పిడుగు పడి ఒకరి మృతి

కడప జిల్లా కాశినాయన మండలం చిన్నాయపల్లిలో విషాదం నెలకొంది. గ్రామానికి చెందిన నారాయణరెడ్డి(60) బుధవారం పొలం వద్దకు వెళ్లాడు. సాయంత్రం తిరిగి వస్తున్న సమయంలో వర్షంతో పాటు పిడుగు పడింది. ఈక్రమంలో ఆయన చనిపోయారు. కుటుంబ పెద్ద కన్నుమూయడంతో బంధువులు బోరున విలపించారు.