News July 31, 2024

విశాఖ: పదవీ విరమణ పొందిన నావికులకు ఘనంగా వీడ్కోలు

image

విశాఖ కేంద్రంగా గల తూర్పు నావికాదళం ఐఎన్‌ఎస్ డేగాలో పదవి విరమణ పొందిన 63 మంది నావికులు వారి కుటుంబాలకు మంగళవారం ఘనంగా వీడ్కోలు పలుకుతూ అభినందన సభ ఏర్పాటు చేశారు. పదవి విరమణ పొందిన నావికులు సేవలను పలువురు ప్రసంశించారు. ధైర్యం, సాహసాలను ప్రదర్శిస్తూ విధులు నిర్వర్తించిన వీరిని ఆదర్శంగా తీసుకోవాలని అధికారులు సూచించారు.

Similar News

News July 11, 2025

వ్యాధులు ప్ర‌బ‌ల‌కుండా ముంద‌స్తు చ‌ర్య‌లు చేప‌ట్టాలి: కలెక్టర్

image

సీజ‌న‌ల్ వ్యాధులు ప్ర‌బ‌ల‌కుండా ముంద‌స్తు చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని, అన్ని చోట్లా ఫాగింగ్ చేయాల‌ని సంబంధిత అధికారుల‌ను క‌లెక్ట‌ర్ హరేంధిర ప్ర‌సాద్ ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లో అధికారులతో సమావేశామయ్యారు. అన్ని వ‌స‌తి గృహాల నిర్వ‌హ‌ణ‌పై ప్రత్యేక దృష్టి సారించాల‌ని, పారిశుద్ధ్య చ‌ర్య‌లు ప‌క్కాగా చేప‌ట్టాల‌ని సూచించారు. దోమ‌ల నివార‌ణ‌లో భాగంగా వీధులలో క్ర‌మం త‌ప్ప‌కుండా ఫాగింగ్ చేయాల‌ని చెప్పారు.

News July 11, 2025

1,371 పాఠశాలలో మెగా పేరెంట్స్&టీచర్స్ మీటింగ్: DEO

image

విశాఖ జిల్లాలో 1,371 పాఠశాల్లో మెగా పేరెంట్స్&టీచర్స్ మీటింగ్ నిర్వహించినట్లు DEO ప్రేమ్ కుమార్ గురువారం తెలిపారు. తోటగరువు జిల్లా పరిషత్ పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమంలో కలెక్టర్ హరేంధిర ప్రసాద్, ఎన్జీవో కాలనీలో ఎంపీ శ్రీభరత్, గోపాలపట్నంలో ప్రభుత్వ విప్ గణబాబు, అనందపురం లో ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, తదితరులు ఈ సమావేశాల్లో పాల్గొన్నారని వివరించారు.

News July 10, 2025

విశాఖ రైల్వే స్టేషన్‌లో త్వరలో క్యాప్సూల్ హోటల్

image

విశాఖ రైల్వే స్టేషన్‌లోని ఒకటో నంబర్ ప్లాట్ ఫారం మొదటి అంతస్తులో త్వరలో క్యాప్సూల్ హోటల్‌ను ప్రయాణికులకు అందుబాటులోకి తేనున్నట్లు DRM లలిత్ బోహ్ర గురువారం తెలిపారు. మొత్తం 88 రూమ్‌లతో కలిగిన హోటల్లో ప్రత్యేకంగా 18 రూములు మహిళలకు మాత్రమే ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. సింగిల్ బెడ్‌లు 3 గంటల వరకు రూ.200, 3-24 గంటల వరకు రూ.400, డబుల్ బెడ్‌లు 3 గంటల వరకు రూ.300, 3-24 గంటలకు రూ.600 అద్దె ఉంటుందన్నారు.