News July 31, 2024
నందిగం గురుకులంలో విద్యార్థిని సూసైడ్

శ్రీకాకుళం జిల్లా నందిగం అంబేడ్కర్ గురుకులంలో ఇంటర్ విద్యార్థిని ఉరివేసుకుని బుధవారం ఆత్మహత్యకు పాల్పడింది. కళాశాలలో ఇంటర్ ప్రథమ సంవత్సరం సీఈసీ చదువుతున్న అక్షిత(16) అనే విద్యార్థిని వసతిగృహం కిటికీకి చున్నీతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆమెది భామిని మండలం పారాపురం కొత్తూరు గ్రామం కాగా వసతిగృహం మరుగుదొడ్లు సమీపంలో సూసైడ్ చేసుకుంది. ఈ మేరకు నందిగం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Similar News
News March 13, 2026
శ్రీకాకుళంలో జోయాలుక్కాస్ షోరూం ప్రారంభం

ప్రముఖ జ్యువెలరీ బ్రాండ్ ‘జోయాలుక్కాస్’ నూతన షోరూం శ్రీకాకుళంలో శుక్రవారం ప్రారంభమైంది. ఎమ్మెల్యే గొండు శంకర్ లాంఛనంగా ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. ప్రపంచస్థాయి ఆభరణాలను జిల్లా ప్రజల ముంగిటకు తీసుకురావడం అభినందనీయమన్నారు. ఇక్కడ వినియోగదారుల అభిరుచికి తగ్గట్లుగా సరికొత్త డిజైన్లతో కూడిన బంగారం, వజ్రాలు, ప్లాటినం తదితర ఆభరణాల ప్రత్యేక కలెక్షన్లను అందుబాటులో ఉంచారన్నారు.
News March 13, 2026
పలాస కేంద్రీయ విద్యాలయంపై X లో కేంద్ర మంత్రి పోస్ట్

పలాసలో కేంద్రీయ విద్యాలయం తరగతులు 2026-27 విద్యా సంవత్సరం నుంచి ప్రారంభం కావడం ఆనందంగా ఉందని కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు. ఈ మేరకు శుక్రవారం X లో పోస్ట్ పెట్టారు. కేంద్రీయ విద్యాలయం ప్రారంభానికి సహకరించిన ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ విద్యాలయం జిల్లాలోని సాయుధ దళాల కుటుంబాలకు, జిల్లా ప్రజలకు ఉపయోగపడుతుందన్నారు.
News March 13, 2026
శ్రీకాకుళం: మాజీ డీజీపీ మృతి

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ డీజీపీ హెచ్.జె.దొర శుక్రవారం కన్నుమూశారు. అనారోగ్య కారణాలతో హైదరాబాద్‌లోని నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన తుదిశ్వాస విడిచారు. శ్రీకాకుళం జిల్లా జర్జంగి గ్రామానికి చెందిన ఆయన.. విధి నిర్వహణలో అత్యంత నిజాయతీ, నిబద్ధత గల పోలీసు అధికారిగా చెరగని ముద్ర వేశారు. దొర ఆకస్మిక మరణం పోలీసు శాఖకు, ఆయన సొంత జిల్లాకు తీరని లోటు.


