News July 31, 2024

HATSOFF: 481 మందిని రక్షించారు

image

కేరళలోని వయనాడ్‌లో ప్రకృతి బీభత్సానికి ఇప్పటివరకు 150 మంది బలయ్యారు. వందల సంఖ్యలో ప్రభావిత ప్రాంతంలో చిక్కుకున్నవారిని రక్షించడంలో సైన్యం, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కీలకంగా వ్యవహరించాయి. నిన్న 481 మందిని ప్రమాదం నుంచి కాపాడాయి. మరో 98 మంది గల్లంతవ్వగా వారి కోసం అన్వేషిస్తున్నాయి. దాదాపు 3వేల మందిని అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఈ ప్రాంతంలో 48 గంటల్లోనే 572mm వర్షపాతం నమోదవ్వడం గమనార్హం.

Similar News

News January 21, 2026

నేటి నుంచి జేఈఈ మెయిన్స్.. అరగంట ముందే గేట్స్ క్లోజ్

image

నేటి నుంచి JEE మెయిన్స్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. నేడు, రేపు, ఎల్లుండి, ఈ నెల 24, 28 తేదీల్లో పేపర్-1, 29న పేపర్-2 పరీక్ష జరగనుంది. రోజు ఉ.9-12 గం. వరకు షిఫ్ట్-1, మ.3-6 వరకు షిఫ్ట్-2లో CBT పద్ధతిలో పరీక్షలు జరుగుతాయి. ఎగ్జామ్‌కు అరగంట ముందే గేట్లు క్లోజ్ చేస్తారు. దేశవ్యాప్తంగా 14 లక్షల మంది, తెలుగు రాష్ట్రాల నుంచి 1.5 లక్షల మంది హాజరుకానున్నారు. ఫోన్లు, వాచులు, ఇయర్ ఫోన్లకు పర్మిషన్ లేదు.

News January 21, 2026

నాలుగోసారి తండ్రి కాబోతున్న JD వాన్స్

image

అమెరికా వైస్ ప్రెసిడెంట్ JD వాన్స్-ఉష దంపతులు మరో బిడ్డకు జన్మనివ్వబోతున్నారు. ఈ విషయాన్ని స్వయంగా వాన్స్ ప్రకటించారు. ‘ఉష మా నాలుగో బిడ్డకు జన్మనివ్వబోతోంది. మా బాబు జులైలో పుట్టబోతున్నాడు. ఈ సంతోష సమయంలో మా ఫ్యామిలీ, దేశం కోసం కష్టపడుతున్న సిబ్బందికి, సేవలందిస్తున్న మిలిటరీ డాక్టర్లకు ధన్యవాదాలు’ అని తెలిపారు. లా స్కూల్లో వీళ్ల మధ్య పరిచయం ఏర్పడింది. వీళ్లిద్దరూ 2014లో పెళ్లిచేసుకున్నారు.

News January 21, 2026

కివీస్ జోరుకు సూర్య కళ్లెం వేస్తారా?

image

నాగ్‌పూర్ వేదికగా ఇవాళ టీమ్ ఇండియా-NZ మధ్య తొలి టీ20 జరగనుంది. ఇప్పటికే ODI సిరీస్ గెలిచి కివీస్ పూర్తి ఆత్మవిశ్వాసంతో ఉంది. స్టాట్స్ ప్రకారం ఇరు దేశాల మధ్య 8 ద్వైపాక్షిక T20 సిరీస్‌లు జరగ్గా భారత్ 5, NZ 3 గెలిచాయి. అయితే సూర్య ఫామ్ కాస్త ఆందోళన కలిగిస్తోంది. అభిషేక్, శాంసన్, ఇషాన్ మంచి స్టార్ట్ ఇస్తే గెలుపు సాధ్యమే. రా.7గం. నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో హాట్‌స్టార్‌లో మ్యాచ్ లైవ్ చూడొచ్చు.