News July 31, 2024

NZB: జిల్లాలో పెరుగుతున్న ‘CYBER’ నేరాలు.!

image

డిజిటల్ లావాదేవీలు పెరుగుతున్న క్రమంలో సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. నిజామాబాద్ జిల్లాలో 2023లో 294 కేసులు నమోదు కాగా ఈ ఏడాదిలో ఇప్పటికీ 44 కేసులు నమోదయ్యాయి. జిల్లాలోని పడ్గల్‌లో ఓ వ్యక్తికి సైబర్ నేరగాళ్లు ఫోన్ చేసి బెదిరించి రూ.95 వేలు వసూలు చేశారు. మన అప్రమత్తతే రక్ష, తెలియని వారి మాటలతో మోసపోవద్దని పోలీసులు అంటున్నారు. వారి సూచనలు పాటిస్తే సైబర్ నేరగాళ్ల వలలో పడకుండా ఉండొచ్చంటున్నారు.

Similar News

News March 10, 2026

నిజామాబాద్: మనస్తాపంతో వ్యక్తి సూసైడ్

image

నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని బూరుడుగల్లీలో సతీష్ అనే వ్యక్తి మంగళవారం మధ్యాహ్నం తన ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఎల్లారెడ్డిలో ఇల్లరికం ఉన్న సతీష్, భార్యతో ఏర్పడిన మనస్పర్థల కారణంగా ఇటీవల నగరానికి తిరిగి వచ్చి పనులు చేసుకుంటున్నాడు. ఈ క్రమంలోనే మనస్తాపానికి గురై ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు సమాచారం. 2వ టౌన్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News March 10, 2026

TUలో అంతర్ కళాశాలల ఖో-ఖో జట్ల ఎంపికలు

image

TU పరిధిలోని డిగ్రీ, పీజీ, ప్రొఫెషనల్ కళాశాలల ఖో-ఖో (పురుషుల, మహిళల) జట్ల ఎంపిక మంగళవారం ప్రారంభమైంది. వర్సిటీ స్పోర్ట్స్ డైరెక్టర్ డా. జి. బాలకిషన్ మాట్లాడుతూ, ఇక్కడ ఎంపికైన క్రీడాకారులు కర్ణాటకలోని దావణగెరె యూనివర్సిటీలో జరిగే సౌత్ జోన్ ఇంటర్ యూనివర్సిటీ టోర్నమెంట్ (2025-26) పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. క్రీడాకారులు తమ నైపుణ్యాన్ని ప్రదర్శించి వర్సిటీకి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.

News March 10, 2026

NZB: రంజాన్ తోఫా పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న టీపీసీసీ చీఫ్..!

image

నిజామాబాద్ పట్టణంలో మంగళవారం నిర్వహించిన రంజాన్ తోఫా పంపిణీ కార్యక్రమంలో పీసీసీ చీఫ్, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. రంజాన్ మాసం సహనం, సోదరభావానికి ప్రతీక ఆన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వం మైనార్టీల సంక్షేమానికి కట్టుబడి ఉందన్నారు. పేద ముస్లింలు పండగను సంతోషంగా జరుపుకోవాలని రంజాన్ తోఫా అందిస్తున్నట్లు ఆయన తెలిపారు.