News July 31, 2024

చీటింగ్ కేసులో సినీ నిర్మాత అరెస్ట్

image

బ్యాంకును మోసగించిన కేసులో సినీ నిర్మాత షేక్ బషీద్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. శంషాబాద్ ఇండస్ ఇండ్ బ్యాంక్ మేనేజర్‌తో కలిసి బషీద్ ఆ బ్యాంకును రూ.40 కోట్ల మేర మోసం చేశాడు. దీంతో ఆయనను సైబరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అల్లరే అల్లరి, మెంటల్ పోలీస్, నోటుకు పోటు వంటి సినిమాలకు బషీద్‌ నిర్మాతగా వ్యవహరించారు. ‘ఎవడ్రా హీరో’ చిత్రంలో హీరోగా నటించారు. రాజంపేట కాంగ్రెస్ MP అభ్యర్థిగా పోటీ చేశారు.

Similar News

News March 15, 2026

కడప: 10th పరీక్షలకు పటిష్ఠ బందోబస్తు

image

కడప జిల్లాలో ఈ నెల 16 నుంచి ఏప్రిల్ 1 వరకు నిర్వహించనున్న 10th పరీక్షలు ప్రశాంతంగా జరిగేలా పటిష్ఠమైన బందోబస్తు ఏర్పాటు చేసినట్లు జిల్లా SP షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఆదివారం తెలిపారు. పరీక్షా కేంద్రాల వద్ద సెక్షన్ 144 అమల్లో ఉంటుందన్నారు. ఇన్విజిలేటర్లు పరీక్షా విధులకు కేటాయించిన సిబ్బంది తప్ప ఇతరులు ఉండరాదన్నారు. ఏవైనా అనుమానాస్పద ఘటనలు జరిగితే వెంటనే డయల్ 112కు సమాచారం ఇవ్వాలన్నారు.

News March 15, 2026

యుద్ధం.. మరో జలసంధి క్లోజ్?

image

ప్రపంచ వాణిజ్యానికి కీలకమైన ‘బాబ్ ఎల్-మండేబ్’ జలసంధిని హౌతీలు మూసివేసే అవకాశం ఉందని హెచ్చరికలు వస్తున్నాయి. ఇప్పటికే హార్ముజ్ మూతపడటంతో గ్యాస్, చమురు సరఫరా అస్తవ్యస్తమైంది. ఇప్పుడు ఈ మార్గం కూడా క్లోజ్ అయితే 30% గ్లోబల్ ట్రేడ్‌పై ప్రభావం పడుతుంది. యూరప్ నుంచి సూయెజ్ కెనాల్ మీదుగా ఇండియా సహా ఆసియాకు వచ్చే నౌకలన్నీ నిలిచిపోతాయి. ఫలితంగా ఇంధన, వస్తువుల ధరలు ఆకాశాన్ని తాకే అవకాశం ఉంది.

News March 15, 2026

మ్యాజిక్ జరిగింది: ‘ఉస్తాద్’ ట్రైలర్‌పై మెగాస్టార్

image

పవన్ కళ్యాణ్ నటించిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ <<19383616>>ట్రైలర్‌<<>>పై మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. ‘‘మ్యాజిక్ జరిగింది.. ముహూర్తం కుదిరింది.. ట్రైలర్ అదిరింది.. ఉగాదికి ‘ఉస్తాద్ భగత్ సింగ్‌’తో అన్నీ శుభాలే’’ అని Xలో పోస్ట్ చేశారు. పవన్, డైరెక్టర్ హరీశ్ శంకర్ సహా సినిమా యూనిట్‌కు బెస్ట్ విషెస్ తెలియజేశారు. ఈ మూవీలో శ్రీలీల, రాశీ ఖన్నా హీరోయిన్లుగా నటించారు. DSP సంగీతం అందించారు. ఈనెల 19న సినిమా రిలీజ్ కానుంది.