News July 31, 2024
విశాఖ నుంచి తిరుమలకు ప్రత్యేక బస్సు సర్వీసు

విశాఖ నుంచి విజయవాడ మీదుగా తిరుపతికి ప్రత్యేక బస్సు సర్వీసును నడపడానికి ఏపీ పర్యాటక సంస్థ ప్రత్యేక ప్యాకేజీ ప్రవేశపెట్టింది. ఆగస్టు 10న మధ్యాహ్నం 3 గంటలకు విశాఖలో ఈ బస్సు బయలుదేరుతుంది. 11 ఉదయాన్నే తిరుపతి చేరుకుంటుంది. ఉదయం 10 గంటలకు శ్రీవారి దర్శనానికి తీసుకువెళ్తారు. తిరుచానూరు, శ్రీకాళహస్తి దర్శనం అనంతరం విశాఖకు బయలుదేరుతుంది. పెద్దలకు రూ.6,300, పిల్లలకు రూ.6,000 చెల్లించాలి.
Similar News
News July 11, 2025
1,371 పాఠశాలలో మెగా పేరెంట్స్&టీచర్స్ మీటింగ్: DEO

విశాఖ జిల్లాలో 1,371 పాఠశాల్లో మెగా పేరెంట్స్&టీచర్స్ మీటింగ్ నిర్వహించినట్లు DEO ప్రేమ్ కుమార్ గురువారం తెలిపారు. తోటగరువు జిల్లా పరిషత్ పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమంలో కలెక్టర్ హరేంధిర ప్రసాద్, ఎన్జీవో కాలనీలో ఎంపీ శ్రీభరత్, గోపాలపట్నంలో ప్రభుత్వ విప్ గణబాబు, అనందపురం లో ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, తదితరులు ఈ సమావేశాల్లో పాల్గొన్నారని వివరించారు.
News July 10, 2025
విశాఖ రైల్వే స్టేషన్‌లో త్వరలో క్యాప్సూల్ హోటల్

విశాఖ రైల్వే స్టేషన్‌లోని ఒకటో నంబర్ ప్లాట్ ఫారం మొదటి అంతస్తులో త్వరలో క్యాప్సూల్ హోటల్‌ను ప్రయాణికులకు అందుబాటులోకి తేనున్నట్లు DRM లలిత్ బోహ్ర గురువారం తెలిపారు. మొత్తం 88 రూమ్‌లతో కలిగిన హోటల్లో ప్రత్యేకంగా 18 రూములు మహిళలకు మాత్రమే ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. సింగిల్ బెడ్‌లు 3 గంటల వరకు రూ.200, 3-24 గంటల వరకు రూ.400, డబుల్ బెడ్‌లు 3 గంటల వరకు రూ.300, 3-24 గంటలకు రూ.600 అద్దె ఉంటుందన్నారు.
News July 10, 2025
కైలాసగిరిపై కొత్త ‘రోప్ వే’ ప్రాజెక్టు

కైలాసగిరిపై కొత్త ‘రోప్ వే’ను V.M.R.D.A. నిర్మించనుంది. ప్రస్తుత రోప్ వే పాతబడింది. ప్రయాణ వ్యవధి తక్కువ. దీంతో కొత్త దారిలో ‘రోప్ వే’ను ప్రతిపాదించామని ఛైర్మన్ ప్రణవ్ గోపాల్ తెలిపారు. దీని ద్వారా బే ఫ్రంట్, విశాఖ నగరం, కొండల దృశ్యాలను త్రీ డైమెన్షనల్ వ్యూలో చూడొచ్చు. సుమారు 1.5 కిలోమీటర్ల పొడవైన ప్రయాణం ఉంటుంది. కార్ పార్కింగ్, ఇతర దర్శనీయ స్థలాలను ఈ రోప్ వే అనుసంధానం చేస్తుంది.