News July 31, 2024
మెదక్: రెండవ విడత రుణమాఫీపై గందరగోళం!

రెండవ విడత పంట రుణమాఫీ గందరగోళంగా ఉందని రైతులు వాపోతున్నారు. సిద్దిపేట జిల్లాలో 79,721 మంది రైతులకు రూ. 558.61 కోట్లు, మెదక్‌లో 74,342 మంది రైతులకు రూ. 473.78 కోట్లు, సంగారెడ్డిలో 77,951 మంది రైతులకు రూ.563.99 కోట్లు మాఫీ అయింది. ఉమ్మడి జిల్లాలో రెండు విడతలు కలిపి 2,32,014 మంది రైతులకు రూ.1,596.38 కోట్ల రుణమాఫీ చేసినట్లు ప్రభుత్వం చెబుతున్నా చాలా మంది రైతులకు మాఫీ జరగలేదని రైతన్నలు వాపోతున్నారు.
Similar News
News March 10, 2026
భూ హక్కుల కోసమే రీ-సర్వే: అదనపు కలెక్టర్

భూములపై పక్కా హక్కులు కల్పించేందుకే రీ-సర్వే చేపడుతున్నట్లు అదనపు కలెక్టర్ నగేష్ తెలిపారు. మంగళవారం రామాయంపేట మండలం అక్కన్నపేటలో నిర్వహించిన ‘భూభారతి’ అవగాహన సదస్సులో ఆయన పాల్గొన్నారు. 100 ఏళ్ల క్రితం నిజాం కాలంలో రూపొందించిన నక్షల్లో ప్రస్తుతం కొన్ని సమస్యలు ఉన్నాయని, వాటిని సరిచేయడమే ఈ సర్వే లక్ష్యమని వివరించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, రైతులు పాల్గొన్నారు.
News March 10, 2026
మెదక్: మహిళ మృతదేహం కలకలం

పాపన్నపేట పోలీస్ స్టేషన్ పరిధిలో గుర్తుతెలియని మహిళ మృతదేహం కలకలం రేపింది. మంగళవారం ఏడుపాయల వెళ్లే రహదారిలోని చెల్మికుంట అడవి ప్రాంతంలో గుర్తుతెలియని మహిళా మృతదేహాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. మృతురాలని ఎవరైనా గుర్తిస్తే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు.
News March 10, 2026
సంక్షేమ శాఖ పనితీరు ఆదర్శనీయం: ఐసీడీఎస్ డైరెక్టర్

మెదక్ జిల్లాలో మహిళా, శిశు సంక్షేమ శాఖ పనితీరు ఆదర్శంగా ఉందని ఐసీడీఎస్ డైరెక్టర్ శృతి ఓజా ప్రశంసించారు. సోమవారం ఆమె మెదక్ జిల్లా కలెక్టరేట్‌లో కలెక్టర్ ప్రతిమ సింగ్‌తో భేటీ అయ్యారు. అంగన్‌వాడీ కేంద్రాలను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని, జిల్లాలోని కేంద్రాలు, సఖి సెంటర్లలో బాధితులకు, చిన్నారులకు మెరుగైన సేవలు అందుతున్నాయని సంతృప్తి వ్యక్తం చేశారు.


