News July 31, 2024
UPSC నూతన ఛైర్ పర్సన్‌గా ప్రీతి

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) నూతన ఛైర్ పర్సన్‌గా ప్రీతి సుదాన్ నియమితులయ్యారు. ఈమె 1983 బ్యాచ్ ఆంధ్రప్రదేశ్ కేడర్‌కు చెందిన రిటైర్డ్ ఐఏఎస్ అఫీసర్. గతంలో ఆమె యూపీఎస్సీ సభ్యురాలిగా ఉన్నారు. ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ కార్యదర్శితోపాటు వివిధ పదవులు నిర్వర్తించారు.
Similar News
News March 21, 2026
BREAKING: భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు

హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఇవాళ బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాయి. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.2,940 తగ్గి రూ.1,45,970, 22 క్యారెట్ల గోల్డ్ రూ.2,750 తగ్గి రూ.1,33,800 పలుకుతోంది. అటు వెండి కిలోపై ఏకంగా రూ.10,000 తగ్గి రూ.2,50,000కి చేరింది.
News March 21, 2026
బాంబుల మోత మధ్య పండుగ!

దూసుకొచ్చే మిస్సైళ్లు.. ఎప్పుడు ఎక్కడ పడతాయో తెలియని బాంబులు. ఇలాంటి భయానక వాతావరణంలో ఇరాన్ సహా గల్ఫ్ దేశాలు రంజాన్ జరుపుకుంటున్నాయి. ఇప్పటికే ఇరాన్-US, ఇజ్రాయెల్ యుద్ధం వేలాది మందిని పొట్టన పెట్టుకుంది. ఇరాన్‌పై ఇజ్రాయెల్-అమెరికా విరుచుకుపడుతుండగా ప్రతీకారంతో ఇరాన్ గల్ఫ్ దేశాలపై దాడులు చేస్తోంది. దీంతో ముస్లింలు ఆనందంగా జరుపుకునే పండుగ భయం గుప్పిట్లో జరుపుకోవాల్సిన పరిస్థితి తలెత్తింది.
News March 21, 2026
‘ఉస్తాద్ భగత్ సింగ్’ 2 రోజుల్లో ఎంత కలెక్ట్ చేసిందంటే?

పవన్-హరీశ్ శంకర్ కాంబోలో వచ్చిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మూవీ 2 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా రూ.59 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసినట్లు Sacnilk తెలిపింది. ఇండియాలో రూ.52 కోట్లు, ఓవర్సీస్‌లో రూ.7 కోట్లు సాధించినట్లు వివరించింది. మొత్తంగా రూ.44 కోట్ల నెట్ కలెక్షన్లు వచ్చాయంది. గురువారంతో పోల్చితే శుక్రవారం థియేటర్లలో షోలతో పాటు సీట్ల ఆక్యుపెన్సీ తగ్గిందని పేర్కొంది. మరి మీరు మూవీ చూశారా? ఎలా ఉంది?


