News July 31, 2024
నేడు HYDకు నూతన గవర్నర్

తెలంగాణ కొత్త గవర్నర్ మధ్యాహ్నం 2గంటలకు హైదరాబాద్‌కు చేరుకోనున్నారు. శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో సీఎం రేవంత్ రెడ్డి ఆయనకు స్వాగతం పలకుతారు. సాయంత్రం 5 గంటలకు రాజ్‌భవన్‌లో తెలంగాణ గవర్నర్‌గా జిష్ణుదేవ్‌వర్మ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మంత్రులు, బీఆర్ఎస్, బీజేపీ ఎమ్మెల్యేలు హాజరుకానున్నారు.
Similar News
News February 13, 2026
HYD: శివారులో 2చోట్ల బోణీ కొట్టిన BRS

రంగారెడ్డి జిల్లాలోని మున్సిపల్ ఎన్నికల్లో BRS బోణీ కొట్టింది. ఇబ్రహీంపట్నంలోని 24 వార్డులకు సంబంధించిన ఫలితాల్లో 11వ వార్డు BRS అభ్యర్థులు శ్రీలత రాంబాబు 484 ఓట్లతో, 12వ వార్డు కొండిగారి త్రిలోక్ 316 ఓట్లతో విజయం సాధించారు. కౌన్సిలర్ త్రిలోక్ మాజీ MLA కొండిగారి రాములు కుమారుడు. ఫలితాలు వేగంగా తెలుసుకునేందుకు STAY TUNED TO Way2News.
News February 13, 2026
HYDలో ఎయిర్ క్వాలిటీ @194

హైదరాబాద్‌లో ఎయిర్ క్వాలిటీలో హెచ్చుతగ్గులు నమోదవుతున్నాయి. సాధరణంగా పొగమంచు, చెత్తాచెదారం, వాహనాల పొగతో కాలుష్యం పెరుగుతుంటుంది. డబుల్ డిజిట్‌లో ఉండే ఎయిర్ క్వాలిటీ శుక్రవారం తెల్లవారుజామున టీచర్స్ కాలనీలో 194గా రికార్డ్ అయ్యింది. శ్వాసకోశ వ్యాధులు, సైనసైటిస్ ఉన్నవారితో పాటు ప్రజలు వీలైనంత వరకు మాస్కులు ధరించడం మేలని డాక్టర్లు సూచిస్తున్నారు.
News February 13, 2026
HYD: యువతి హత్య.. ఇన్‌ఫార్మర్ అతడే!

మొయినాబాద్‌లో ఆస్తికోసం అన్న, చెల్లి(న్యాయవాది)ని కిరాతకంగా చంపిన కేసులో పోలీసులు కీలక విషయాలు సేకరించారు. ఈ కేసులో శేఖర్ అనే వ్యక్తి స్వప్న అన్న రాజుకు ఇన్‌ఫార్మర్‌గా ఉంటూ కేతిరెడ్డిపల్లి నుంచి సమాచారం ఇచ్చాడు. ఆ సమాచారంతో రాజు, సందీప్, వీరేశ్, శివలింగం ఆమెను కిరాతకంగా హతమార్చారు. ముందు పొంతనలేని సమాధానం చెప్పినా తర్వాత నిజం ఒప్పుకున్నారు. గురువారం ఐదుగురిని రిమాండ్‌కు తరలించారు.


