News July 31, 2024
పవన్ కళ్యాణ్ వార్నింగ్

AP: అటవీశాఖ ఉద్యోగులపై దాడి చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని డిప్యూటీ CM పవన్ కళ్యాణ్ హెచ్చరించారు. పల్నాడు(D) విజయపురి సౌత్‌రేంజ్ ఫారెస్ట్ పరిధిలో వన్యప్రాణులను అక్రమ రవాణా చేసే ముఠాను అదుపులోకి తీసుకుంటుండగా ఫారెస్ట్ సిబ్బందిపై జరిగిన దాడిని ఆయన ఖండించారు. దాడికి పాల్పడ్డ వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పవన్ పేర్కొన్నారు. వన్యప్రాణి సంరక్షణ చట్టాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని అధికారులను కోరారు.
Similar News
News March 20, 2026
ధురంధర్-2 చెత్త సినిమా.. నటి విమర్శలు

‘ధురంధర్-2’పై ప్రశంసలు వెల్లువెత్తుతుంటే కన్నడ నటి రమ్య స్పందన తీవ్ర విమర్శలు చేశారు. ‘ఇప్పుడే ధురంధర్-2 సినిమా చూశా. ఇది నా ఓపికకు పరీక్ష పెట్టింది. ఇదో చెత్త సినిమా. బోరింగ్ సబ్జెక్ట్ చదివినట్లు ఉంది. ఈ మూవీ చూసి సమయం, డబ్బులు వృథా చేసుకోకండి. దర్శకత్వం, డైలాగ్స్, ఎడిటింగ్, BGM, నటన.. ఏవీ బాలేవు. డైరెక్టర్ ఆదిత్య ధర్.. మీ మితిమీరిన జాతీయవాదం, దుష్ప్రచారాన్ని ఆపండి’ అని ట్వీట్ చేశారు.
News March 20, 2026
శ్రీవారి సన్నిధిలో ఇక కల్తీకి చెక్: సత్యకుమార్

AP: శ్రీవారి లడ్డూ, అన్న ప్రసాదాల్లో నాణ్యత, స్వచ్ఛత పెంచేలా చర్యలు తీసుకున్నామని మంత్రి సత్యకుమార్ తెలిపారు. ‘తిరుమలలో ఏర్పాటైన స్టేట్ ఫుడ్ ల్యాబొరేటరీని CM CBN రేపు ప్రారంభిస్తారు. నెయ్యి, నూనె, పాలు, ఇతర ముడిసరకుల్లో కల్తీని పసిగట్టే పరీక్షలు ఇక్కడ జరుగుతాయి. ఫెస్టిసైడ్స్, ప్రిజర్వేటివ్స్ వంటి అవశేషాలనూ గుర్తిస్తారు. పుణ్య క్షేత్రాల్లో ఇలాంటి ల్యాబ్ ఏర్పాటు కావడం ఇదే తొలిసారి’ అని తెలిపారు.
News March 20, 2026
ఇంటి పనులను భర్త షేర్ చేసుకోవాలి: సుప్రీంకోర్టు

తన భార్యకు వంట సహా ఇంటి పనులు సరిగ్గా చేయడం రాదంటూ ఓ వ్యక్తి దాఖలు చేసిన విడాకుల పిటిషన్‌పై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. కాలం మారిందని, ఇంటి పనులను భర్త కూడా షేర్ చేసుకోవాలని పేర్కొంది. ‘మీరు పనిమనిషిని కాదు.. జీవిత భాగస్వామిని పెళ్లి చేసుకున్నారు’ అని తెలిపింది. తన పేరెంట్స్‌కు ఆహారం పెట్టడానికి ఆమె నిరాకరించిందని భర్త కోర్టుకు చెప్పారు. వాదనలు విన్న న్యాయస్థానం విచారణను వాయిదా వేసింది.


