News July 31, 2024

‘ఆకాశంలో ఒక తార’పై రచయిత ఇంట్రెస్టింగ్ కామెంట్స్

image

స్టార్ హీరో దుల్కర్ నటిస్తోన్న ‘ఆకాశంలో ఒక తార’ సినిమా రచయిత ఎవరో తెలుసా? తెలుగు ప్రేక్షకులకు ఎప్పటికీ గుర్తుండిపోయే ‘అమృతం’ సీరియల్‌ను అందించిన గుణ్ణం గంగరాజు. దీనిపై ఆయన ట్విటర్‌లో స్పందిస్తూ.. ఈ స్క్రిప్ట్ రాయడం తనకెంతో ఆనందాన్ని ఇచ్చిందన్నారు. సీతారామశాస్త్రి పాట ‘నింగి ఎంత పెద్దదైనా రివ్వుమన్న గువ్వ పిల్ల రెక్క ముందు తక్కువేనురా’ సాంగ్‌కు ఈ కథ వాస్తవరూపం దాల్చినట్లు ఉంటుందని తెలిపారు.

Similar News

News April 18, 2026

ఇరాన్ రాయబారికి భారత్ సమన్లు

image

హార్ముజ్‌‌ను దాటేందుకు ప్రయత్నించిన రెండు ఇండియన్ నౌకలపై IRGC కాల్పులు <<19684352>>జరపడాన్ని<<>> భారత్ సీరియస్‌గా తీసుకుంది. ఢిల్లీలోని ఇరాన్ రాయబారికి సమన్లు ఇచ్చినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. ఈ ఘటనకు గల కారణాలపై వివరణ ఇవ్వాలని కోరినట్లు పేర్కొన్నాయి. కాగా దాడులకు గురైన నౌకలోని సిబ్బందికి ఎలాంటి గాయాలు కాలేదని సమాచారం.

News April 18, 2026

వేగంగా కోలుకుంటున్నా.. త్వరలోనే యాక్షన్‌లోకి: వరుణ్ తేజ్

image

‘బరి’ సినిమా కోసం వాలీబాల్ ప్రాక్టీస్ చేస్తూ <<19657793>>గాయపడిన<<>> మెగా హీరో వరుణ్ తేజ్ తన హెల్త్ అప్డేట్ వెల్లడించారు. సర్జరీ తర్వాత వేగంగా రికవరీ అవుతున్నానని ఇన్‌స్టాలో తెలిపారు. ఫుల్ స్ట్రెంత్‌తో తిరిగొస్తానని పేర్కొన్నారు. గతంలో కంటే బలంగా త్వరలోనే యాక్షన్‌లోకి దిగుతానన్నారు. తనపై ప్రేమాభిమానాలు చూపిస్తున్న అందరికీ థాంక్స్ చెప్పారు. కాగా ఈ చిత్రాన్ని సోదరి నిహారిక నిర్మిస్తున్న విషయం తెలిసిందే.

News April 18, 2026

అభిషేక్ ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ

image

IPL: చెన్నైతో మ్యాచులో SRH ఓపెనర్ అభిషేక్ శర్మ దూకుడుగా ఆడుతున్నారు. చెన్నై బౌలర్లపై విరుచుకుపడుతూ 15 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నారు. అందులో 4 సిక్సర్లు, 5 ఫోర్లు ఉన్నాయి. ‘పులి’కి IPLలో ఇదే ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ కావడం విశేషం. అటు హెడ్ (20 బంతుల్లో 23), ఇషాన్ కిషన్ (0) ఔటయ్యారు. ప్రస్తుతం 6 ఓవర్లలో స్కోర్ 75/2గా ఉంది.