News July 31, 2024
WGL: కుమారుడి ప్రాణం కాపాడాలని తల్లిదండ్రుల వినతి
జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం మండెలగూడెం వాసి బాబు, కళ్యాణి దంపతులకు కొద్దిరోజుల క్రితం బాబు జన్మించాడు. పుట్టుకతోనే శ్వాసకోశ నాళం, ఆహార నాళం అతుక్కుపోయింది. గుండెలో రంధ్రం పడింది. ఒకే కిడ్నీతో బాధపడుతున్నాడు. HYD బోడుప్పల్‌లోని అంకుర ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడని, ఆపరేషన్‌కు రూ.7 లక్షలు కావాలని పేద కుటుంబానికి చెందిన ఆ తల్లిదండ్రులు వాపోతున్నారు. KTR, దాతలు ఆదుకోవాలని వారు కోరుతున్నారు.
Similar News
News November 28, 2024
భద్రకాళి చెరువు పూడికతీత పనులను వేగవంతంగా చేపట్టాలి: కలెక్టర్
భద్రకాళి చెరువు పూడికతీత పనులను వేగవంతంగా చేపట్టాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య అధికారులను ఆదేశించారు. బుధవారం భద్రకాళి చెరువులో చేపట్టిన పూడికతీత పనులను హనుమకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య, వరంగల్ జిల్లా కలెక్టర్ డా.సత్య శారద, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అశ్విని తానాజీ వాకడే పరిశీలించారు.
News November 28, 2024
దివ్యాంగుల రాష్ట్రస్థాయి క్రీడా పోటీలను ప్రారంభించిన మంత్రి సీతక్క
హైదరాబాదులోని గచ్చిబౌలి స్టేడియంలో జరుగుతున్న రాష్ట్రస్థాయి దివ్యాంగుల క్రీడా పోటీలను తెలంగాణ రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. దివ్యాంగులు పట్టుదలతో ఉండి, అనుకున్నది సాధించాలని సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వం దివ్యాంగుల అభివృద్ధికి పెద్ద పీట వేస్తుందని తెలియజేశారు.
News November 27, 2024
భద్రకాళి చెరువు పూడికతీత పనులను వేగవంతంగా చేపట్టాలి: కలెక్టర్
భద్రకాళి చెరువు పూడికతీత పనులను వేగవంతంగా చేపట్టాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య అధికారులను ఆదేశించారు. బుధవారం భద్రకాళి చెరువులో చేపట్టిన పూడికతీత పనులను హనుమకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య, వరంగల్ జిల్లా కలెక్టర్ డా.సత్య శారద, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అశ్విని తానాజీ వాకడేలు పరిశీలించారు.