News July 31, 2024

ఉమ్మడి ప్రకాశం జిల్లాలో 25 మంది తహశీల్దార్లకు పోస్టింగ్

image

ఉమ్మడి ప్రకాశం జిల్లా నుంచి సార్వత్రిక ఎన్నికలలో భాగంగా EC ఆదేశాల మేరకు పలువురు తహశీల్దార్లు పక్క జిల్లాలకు బదిలీపై వెళ్లారు. బదిలీపై వెళ్లిన 25 మంది తహశీల్దార్లు ఆయా జిల్లాల నుంచి రిలీవ్ పొంది, 2 రోజుల క్రితం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో రిపోర్ట్ చేశారు. జిల్లా కలెక్టర్ వెంకట మురళి 25 మంది తహశీల్దార్లకు జిల్లాలో పోస్టింగ్ కల్పిస్తూ మంగళవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు.

Similar News

News March 11, 2026

ప్రకాశం: వడగాల్పులపై ముందస్తు చర్యలు

image

ప్రకాశం జిల్లాలో వడగాల్పుల ప్రభావాన్ని తగ్గించేందుకు జిల్లా కలెక్టర్ రాజాబాబు అధికారులను అప్రమత్తం చేశారు. ఎండల కారణంగా ప్రాణ నష్టం జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఉపాధి హామీ పనుల సమయాల్లో మార్పులు చేయాలని, మధ్యాహ్నం పనులు నిలిపివేయాలని ఆదేశించారు. గ్రామాల్లో తాగునీటి బోర్లు మరమ్మతు చేసి, నీటి కొరత లేకుండా చూడాలని అన్నారు.

News March 11, 2026

ప్రకాశం జిల్లాలో ప్రభుత్వ ఉద్యోగాలు.!

image

ప్రకాశం జిల్లా డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ పరిధిలోని ఆసుపత్రుల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి దరఖాస్తుల స్వీకరణ, ఫైనల్ మెరిట్ జాబితా‌ను మంగళవారం జిల్లా కో-ఆర్డినేటర్ విడుదల చేశారు. ఈ మేరకు ఆడియో మెట్రిటీషియన్, థియేటర్ అసిస్టెంట్, జనరల్ డ్యూటీ అటెండెంట్, పోస్టుమార్టం అసిస్టెంట్ తదితర పోస్టుల తుది జాబితాను (prakasam.ap.gov.in)వెబ్ సైట్‌లో పొందుపరిచినట్లు తెలిపారు. అభ్యర్థులు గమనించాలని కోరారు.

News March 11, 2026

ప్రకాశం: ఆసుపత్రులలో జాబ్స్.. తుది జాబితా విడుదల..!

image

ప్రకాశం జిల్లా డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ పరిధిలోని ఆసుపత్రులలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి స్వీకరించిన దరఖాస్తుల ఫైనల్ మెరిట్ జాబితా‌ను మంగళవారం జిల్లా కో ఆర్డినేటర్ విడుదల చేశారు. ఈ మేరకు ఆడియో మెట్రిటీషియన్, థియేటర్ అసిస్టెంట్, జనరల్ డ్యూటీ అటెండెంట్, పోస్టుమార్టం అసిస్టెంట్,తదితర పోస్టుల తుది జాబితాను (prakasam.ap.gov.in)వెబ్ సైట్‌లో పొందుపరిచినట్లు తెలిపారు. అభ్యర్థులు గమనించాలని కోరారు.