News July 31, 2024

వాటికి యునెస్కో గుర్తింపు తీసుకురావాలి: జాస్తి వీరాంజనేయులు

image

AP: రాష్ట్రంలో 129 కట్టడాల్లో ఒక్కదానికీ యునెస్కో వారసత్వ సంపద జాబితాలో చోటు దక్కలేదని అమరావతి అభివృద్ధి కమిటీ ఛైర్మన్ జాస్తి వీరాంజనేయులు ఆవేదన వ్యక్తం చేశారు. ‘గండికోట, అమరావతి, నాగార్జునకొండ, సాలిహుండం, శంకరం, అతి పెద్ద ఏకశిలా నంది, అతి పెద్ద 7 పడగల నాగేంద్రుడు, 856 స్తూపాల ఆలయం, వేలాడే ధ్వజస్తంభం, 12 ధ్వజస్తంభాలతో కూడిన నాట్య మండపాల గుర్తింపునకు ప్రభుత్వం క‌ృషి చేయాలి’ అని పేర్కొన్నారు.

Similar News

News January 14, 2026

చితిపై నుంచి లేచిన బామ్మ.. ఆ తర్వాత..

image

మహారాష్ట్ర నాగ్‌పూర్ జిల్లాలో వింత ఘటన జరిగింది. 103 ఏళ్ల గంగాబాయి చనిపోయిందని కుటుంబసభ్యులు భావించి.. బంధువులకు కబురు పంపారు. ముక్కులో దూది పెట్టి అంతిమ యాత్రకు సిద్ధమయ్యారు. ఇంతలో ముడివేసిన గంగాబాయి కాలి వేళ్లు కదలడాన్ని మనవడు గమనించాడు. వెంటనే దూది తీసేయగా ఆమె లోతుగా శ్వాస తీసుకుంది. అదేరోజు గంగాబాయి పుట్టినరోజు కావడం విశేషం. దీంతో వీడ్కోలుకు వచ్చినవారు హ్యాపీగా కేక్ తిని వెళ్లిపోయారు.

News January 14, 2026

ఇందిరమ్మ పథకం.. ఖాతాల్లో డబ్బులు జమ

image

TG: ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్ లబ్ధిదారులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ప్రతి వారం బిల్లుల చెల్లింపుల ప్రక్రియలో భాగంగా ప్రస్తుత వారానికి రూ.152.40 కోట్లను విడుదల చేసింది. ఈ మొత్తాన్ని 13,861 మంది ఖాతాల్లో జమ చేసినట్లు పేర్కొంది. ఇప్పటివరకు 2.50 లక్షల ఇళ్ల పనులు ప్రారంభమయ్యాయని, మార్చి నాటికి నిర్మాణాలు పూర్తవుతాయని తెలిపింది. ఎవరైనా లంచం డిమాండ్ చేస్తే 1800 599 5991కు ఫిర్యాదు చేయాలని సూచించింది.

News January 14, 2026

గంజితో ఎన్నో లాభాలు

image

అన్నం వండిన తర్వాత వచ్చే గంజి తాగడం వల్ల ఆరోగ్యానికి మాత్రమే కాకుండా చర్మానికి కూడా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. గంజిలో విటమిన్స్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి చర్మ సౌందర్యాన్ని పెంచడంలో సాయపడతాయంటున్నారు నిపుణులు. గంజిని ఒక మెత్తని వస్త్రం లేదా దూదితో ముఖానికి అప్లై చేసుకోవాలి. ఇలా అప్లై చేసిన పదినిమిషాల తర్వాత ముఖాన్ని శుభ్రం చేసుకుంటే చర్మం నిగనిగలాడుతుంది.