News July 31, 2024
కాసేపట్లో ఈ ప్రాంతాల్లో వర్షాలు

తెలంగాణలోని పలు జిల్లాల్లో మరికాసేపట్లో వర్షాలు కురుస్తాయని HYD వాతావరణ కేంద్రం తెలిపింది. మహబూబ్‌నగర్, రంగారెడ్డి, నాగర్‌కర్నూల్, నల్గొండ, సూర్యాపేట, కామారెడ్డి, జగిత్యాల, కరీంనగర్, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల, వికారాబాద్ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని ఎల్లో అలర్ట్ జారీ చేసింది. గంటకు 40కి.మీ వేగంతో ఈదురుగాలులు కూడా వీస్తాయని వెల్లడించింది.
Similar News
News April 2, 2026
మరోసారి తగ్గిన గోల్డ్ రేటు

పెట్టుబడిదారులకు బంగారం ధరలు షాక్ ఇచ్చాయి. ట్రంప్ ప్రకటనతో డాలర్‌పై ఒత్తిడి, భౌగోళిక రాజకీయ అనిశ్చితి వల్ల బంగారం ధరలు ఇవాళ <<19544455>>మరోసారి<<>> పడిపోయాయి. HYD బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.3,980 తగ్గి రూ.1,48,970కు చేరింది. 22 క్యారెట్ల 10గ్రాముల గోల్డ్ రేటు రూ.3,650 పతనమై రూ.1,36,550 పలుకుతోంది. కేజీ సిల్వర్ రేటు రూ.2,55,000గా ఉంది. తగ్గుతున్న ధరలు కొనుగోలుదారులకు ఊరటనివ్వనున్నాయి.
News April 2, 2026
చట్టబద్ధతతో శాశ్వత రాజధానిపై స్పష్టత: రామ్మోహన్

విభజన తర్వాత రాజధాని లేని రాష్ట్రంగా ఏపీ మారిందని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు రాజ్యసభలో చర్చ సందర్భంగా అన్నారు. శాశ్వత రాజధానిగా అమరావతికి చట్టబద్ధతతో ప్రజలకు స్పష్టత ఇస్తున్నామని తెలిపారు. 2014లోనే అమరావతిపై అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం జరిగిందని గుర్తుచేశారు. కానీ 2019-24 మధ్య YCP ప్రభుత్వం 3 రాజధానుల నాటకమాడిందని మండిపడ్డారు. రాజధాని కోసం ఉద్యమించిన రైతులను హింసించిందని ఆరోపించారు.
News April 2, 2026
వరుసగా 3 రోజులు సెలవులు

వరుసగా 3 రోజులు సెలవులు రానున్నాయి. పలు ఐటీ కంపెనీలు, ప్రైవేట్ స్కూళ్లకు శని, ఆదివారాలు హాలిడేస్ ఉంటాయి. ఇక రేపు గుడ్ ఫ్రైడ్ సందర్భంగా పబ్లిక్/ఆప్షనల్ హాలిడే ఉంది. దీంతో రేపట్నుంచి 3 రోజులు సెలవులు ఉండనున్నాయి. లాంగ్ వీకెండ్ రావడంతో ఐటీ కంపెనీల ఉద్యోగులు సొంతూళ్లు, హాలిడే స్పాట్లకు వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు.


